WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కింద 2,93, 000 ఎకరాలు
– మధ్యతరహా ప్రాజెక్టులకు 21,905 ఎకరాలు
– చిన్న తరహా ప్రాజెక్టులకు కింద 52,545 ఎకరాలకు
సాగునీరు
– అందించనున్నట్లు మంత్రి రాజా వెల్లడి
– కరీప్ ప్రణాళిక పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన
– జూన్ 1న గోదావరి తూర్పు డెల్టా, పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల
– సమావేశంలో ఎంపీ గీత, కలెక్టర్ కృతికా, జడ్పీ చైర్మన్ విప్పర్తి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ‌, విశ్వం వాయిస్ః

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌కు జూన్ 1న డెల్టా కాలువ‌లకు నీటిని విడుద‌ల చేసి, పూర్తి ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందించ‌నున్న‌ట్లు రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. 2022 ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి స్థానిక జిల్లా నీటి సారుద‌ల స‌ల‌హా మండ‌లి, జిల్లాస్థాయి వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి స‌మావేశాలు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వివేకానంద హాల్‌లో జ‌రిగాయి. మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, జెడ్‌పీ ఛైర్‌ప‌ర్స‌న్ విప్ప‌ర్తి వేణుగోపాల‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియా‌, ఎమ్మెల్సీలు అనంత ఉద‌య‌భాస్క‌ర్‌, చిక్కాల రామ‌చంద్ర‌రావు, పిఠాపురం, జ‌గ్గంపేట శాస‌న‌స‌భ్యులు పెండెం దొర‌బాబు, జ్యోతుల చంటిబాబు, రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ద్వారంపూడి భాస్క‌ర‌రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ద‌వులూరి దొర‌బాబు, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ లంక ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌రైన ఈ స‌మావేశాల్లో తొలుత ధ‌వ‌ళేశ్వ‌రం ఇరిగేష‌న్ స‌ర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా జిల్లాలో సాగునీటి వ‌న‌రులు, పంట కాలువలు, డ్రెయిన్లు, మండ‌లాల వారీగా ఆయ‌క‌ట్టు వివ‌రాలు త‌దిత‌రాల‌ను వివ‌రించారు.
భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టుల కింద 2,93,000 ఎక‌రాలు, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల కింద 21,905 ఎక‌రాలు, చిన్న‌త‌ర‌హా ప్రాజెక్టుల కింద 52,545 ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొన్నేళ్లుగా న‌వంబ‌ర్‌లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా రైతుల‌కు న‌ష్టం వాటిల్లుతోంద‌ని.. ఈ ప‌రిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఒక‌నెల ముందుగానే అంటే జూన్ 1వ తేదీ నుంచే ఖ‌రీఫ్ పంట ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేసేలా ముఖ్య‌మంత్రి సూచించార‌ని తెలిపారు. జూన్ 1న గోదావ‌రి తూర్పు డెల్టా, పుష్క‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఆయ‌క‌ట్టుకు నీటి విడుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అదే విధంగా జూన్ 15 నుంచి ఏలేరు, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల ఖ‌రీఫ్ విజ‌య‌వంతంగా ముగిసి.. మూడో పంట కింద అప‌రాలు వేసి, అధిక ఆదాయం పొందేందుకు వీల‌వుతుంద‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా కౌలు రైతుల‌కు మూడో పంట ద్వారా లబ్ధి చేకూరుతుంద‌న్నారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మూడో పంట వేసేందుకు వీలుగా సీజ‌న్ల‌ను గాడిలో పెట్టేందుకు ముఖ్య‌మంత్రి చొర‌వ‌చూపార‌న్నారు. ఈ నెల చివ‌రినాటికి ఆర్‌బీకేల స్థాయిలో ఖ‌రీఫ్‌కు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, పురుగు మందులను అవ‌స‌రం మేర‌కు సిద్దంగా ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ్రామ‌స్థాయిలో ఏర్ప‌డిన రైతు భ‌రోసా కేంద్రాలు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తున్నాయ‌ని.. ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా రైతు సంక్షేమానికి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో అమ‌లుచేస్తున్న‌ట్లు మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి అడుగుజాడ‌ల్లో ఆయ‌న త‌న‌యుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్న‌దాతల సంక్షేమం కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. రైతుల శ్రేయ‌స్సుకు ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న చ‌ర్య‌లకు ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రించి పంట‌లు బాగా పండి, అన్న‌దాత‌ల ఇంట వెలుగులు నిండుతున్నాయ‌ని పేర్కొన్నారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా గ్రామాల్లో ఆర్‌బీకేల‌ను ఏర్పాటుచేశార‌ని.. ప్ర‌తి ద‌శ‌లోనూ ఇవి రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నాయ‌న్నారు. సాగుకు సంబంధించి ఏ ద‌శ‌లోనూ రైతుకు న‌ష్టం వాటిల్ల‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌టిష్ట పంట ప్ర‌ణాళిక‌ను కేలండ‌ర్ ప్ర‌కారం అమ‌లుచేయాల‌ని ముఖ్య‌మంత్రి ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఎంపీ వంగా గీత తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఖ‌రీఫ్‌కు సంబంధించి నీటి పారుద‌ల ప్ర‌ణాళిక‌పై ఈ నెల 21న మండ‌లస్థాయిలో స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు. అదే విధంగా 23వ తేదీన ఆర్‌బీకే స్థాయిలో వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌ళ్ల స‌మావేశాలు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ఈ స‌మావేశాల ద్వారా ఖ‌రీఫ్ ప్ర‌ణాళిక‌పై రైతుల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇరిగేష‌న్‌, వ్య‌వసాయ శాఖ అధికారులు.. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ఖ‌రీఫ్ సీజ‌న్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు. గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుల మొద‌లు జిల్లాస్థాయి అధికారి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. జిల్లాస్థాయి స‌మావేశాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య‌కుమార్‌, ఏపీఎంఐపీ పీడీ ఎస్‌.రాంమోహ‌న్‌రావు, పోల‌వ‌రం ఎడ‌మ ప్ర‌ధాన కాలువ ఎస్ఈ శ్రీనివాస్ యాద‌వ్‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement