జిల్లా కలెక్టర్ మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
బొమ్మూరు గ్రామ పంచాయతీని జగనన్న స్వచ్ఛ సంకల్ప ఈ కార్యక్రమంలో భాగంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత స్పష్టం చేశారు.
మంగళవారం స్థానిక బొమ్మూరు లోని డబ్బింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డబ్బింగ్ యాడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బొమ్మూరు పంచాయతీ ని స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు రావాలన్నారు. పంచాయతీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం ఇస్తామని తెలిపారు. ఇంటింటికి చెత్త సేకరణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలతో కుడి నివేదిక అందించాలన్నారు. డంపింగ్ యార్డులను సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తద్వారా స్థానిక సంస్థలు ఆర్థిక బలోపెతం కావాలని సూచించారు. బొమ్మూరు పంచాయతీ పరిధిలో 54 మంది పారిశుద్ధ్య కార్మికులు ఐదు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఇంటింటి చెత్త సేకరణకు తోపుడు రిక్షాలు అవసరం ఉందని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట ఇన్చార్జి డీపీవో జె.సత్యనారాయణ, ఎంపీడీవో రత్నకుమారి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.