విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
( విశ్వం వాయిస్ న్యూస్:) రాయవరం
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సారా నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పరివర్తన పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిందని జెడ్ పి టి సి నల్లమిల్లి మంగతాయారు పేర్కొన్నారు. మండలంలో పసలపూడి గ్రామంలో బుధవారం పరివర్తన కార్యక్రమం రాయవరం ఎస్సై పి.వి.ఎస్ ఎస్ ఎన్ సురేష్, ఎక్సైజ్ ఎస్సై శేఖర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి మందు తయారు మాట్లాడుతూ సారా రహిత గ్రామంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో ఎస్సై సురేష్ మాట్లాడుతూ సారా అమ్మకాలు కారణంగా గతంలో రెడ్ జోన్ గా ఉన్న గ్రామాన్ని గ్రీన్ జోన్ లోకి తీసుకు వచ్చామన్నారు. సార తయారుచేసిన, అమ్మి నా నేరమని అటువంటి వారిని ప్రోత్సహించి రాదని, అలాగే మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశా మొబైల్ యాప్ను అధిక సంఖ్యలో ప్రజల డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ శాఖ అధ్యక్షులు చింత సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు ఆశావర్కర్లు డ్వాక్రా మహిళలు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.