విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆస్పత్రి అభి వృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీపీ చౌడు వెంకటరమణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో పీహెచ్సీలో బుధవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు జాప్యం లేకుండా సత్వర వైద్యసేవలందించే విధంగా
చూడాలన్నారు. ప్రభుత్వం వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అందుకనుగు ణంగానే వైద్య సేవలందించాలన్నారు. అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ దేవిరాజశ్రీ మాట్లాడుతూ ఆస్పత్రి పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అంది స్తున్న వైద్య సేవలను వివరించారు. ఆస్పత్రి అవ సరాలపై సమావేశంలో చర్చించారు. కొత్త ఇన్వర్టర్ బ్యాటరీ, ఫెటల్ డాప్లర్, నెబ్యులైజర్
తదితర పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో తహసీల్దారు కేజే ప్రకాష్ బాబు, డాక్టర్ రమ్యశ్రీ, సీనియర్ అసిస్టెం ట్ గోవిందబాబు తదితరులు పాల్గొన్నారు.