విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
అంగర ( విశ్వం వాయిస్ న్యూస్ )
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును చేర్చి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గా నామకరణం చెయ్యడం పై కపిలేశ్వరపురం మండలం వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు గురువారం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ పార్క్ లో వున్న అంబేడ్కర్ విగ్రహంనకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూల మాలలు వేసి,పాలాభిషేకం తోఘనంగా నివాళులర్పించారు.ప్రజల ఆకాంక్ష ను గౌరవించి కోనసీమ జిల్లాను బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గా నామకరణం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన బీ ఆర్ అంబేద్కర్ పేరు ను సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు పెట్టడం చాలా ఆనందించాల్సిన విషయం అని పలువురు వక్తలు కొనియాడారు. స్వతంత్ర భారతావని లో బాబా సాహెబ్ అంబేద్కర్ చిరస్మరీయుడు అని నాయుకులన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీపీ మే డిశెట్టి సత్యవేని దుర్గారావు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చుండ్రు చిట్టిబాబు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు,సర్పంచ్ వాసా కోటేశ్వర రావు, ఎంపీటీసీ లు మెడి శెట్టి దుర్గారావు,అడ్డాల శ్రీనివాస్, గొల్లపల్లి సోనియా, ఉమ్మిడిశెట్టి సూరిబాబు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గుడిమెట్ల శివ రామ కృష్ణ,వంగా నల్ల శ్రీను, నక్క సింహాచలం,దాసి రాంజీ అంబేద్కర్, ప్రగడ అర్జునరావు, కట్టా మురళి కృష్ణ, వాసంసెట్టి విష్ణు మూర్తి,సలాధి వీర బాబు,జే సి బీ వెంకటేశ్వరరావు, సమక్కాయల దొరబాబు, తోట కూర రాజు,పాలంగి కిశోర్, రేలంగి శ్రీనివాస్, ఎమ్. గోవిందు,మాట్టపర్తి పాలరాజు, నేలసూర్య కుమార్, నెలపూడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.