విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నగర పంచాయతీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి అధ్యక్షతన గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్, ఐదో వార్డ్ కౌన్సిలర్ ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ ‘కోనసీమ’ జిల్లా ను డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలముతో వునికి పుచ్చుకున్న ప్రాంతమని ఇచ్చట అంబేద్కర్ స్ఫూర్తితో ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ కోనసీమ ప్రాముఖ్యతను తేటతెల్లం చేశారని గుర్తు చేశారు, ముఖ్యముగా ఈ కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లా నామకరణం చేయడానికి ఇచ్చట ప్రజలు-అంబేద్కరియులు -మరియు పాలకపక్షం-ప్రతిపక్షాల పాత్ర శ్లాఘనీయం అని ప్రతి వ్యక్తి క్రమశిక్షణతో అంబేద్కర్ స్ఫూర్తితో ‘విజ్ఞాన దీక్ష ద్వారా’పార్టీలకు అతీతంగా కృషి చేశారని వారి కృషి చారిత్రాత్మకమైన గుర్తింపు తెచ్చిందని. కోనసీమ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం పట్ల యావత్ దళిత జాతికి దక్కిన గౌరవంగా భావించాలని ఆయన అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో నగర పంచాయతీ మహిళా అధ్యక్షురాలు మెండీ కమల, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, వీళ్ల వీరస్వామి నాయుడు, ఎస్ఎంఎస్ ప్రసాద్,చింతపల్లి రాజు, నక్కా చంటి,రెడ్డి బాలకృష్ణ,జనిపళ్లి దుర్గాప్రసాద్,మొదలగువారు పాల్గొన్నారు.