విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కే గంగవరం:
కె. గంగవరం మండలం (విశ్వం వాయిస్ )
కుందూరు గ్రామ0 ఆర్ బీ కే భవనం ప్రక్క స్థలంలో పాస్టర్ పి.జీవనందం ఆధ్వర్యంలో ఈ నెల 17,18 వ, తేదీలలో విడుదల ఉజ్జీవ మహోత్సవం లు ఘనంగా నిర్వహించారు. ఏలూరు నుండి వచ్చిన ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ నాయన జాషువా గారు చేసిన వాక్య సందేశం క్రైస్తవ విశ్వాసులు శ్రద్ధగా విన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన సంఘ కాపరి జాన్సన్ ప్రావిన్స్ చక్కని సంగీత వాయిద్యాలు నడుమ స్తుతి ఆరాధన జరిపించారు. పూర్వపు తాళ్ళరేవు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు చెప్పిన దైవ సాక్ష్యం విశ్వాసులు శ్రద్ధగా విన్నారు.అనంతరం ఆయన ఆర్ధిక సహాయం తో వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ క్రైస్తవ మహోత్సవాలు కుందూరు పరిసర గ్రామాలయిన గంగవరం, నెలపర్తిపాడు, రావిచెరువు, టేకి, పానింగిపల్లి తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో దైవ విశ్వాసులు తరలివచ్చారు. ఈ వేడుకలు పాల్గొన్న వారికి భోజన వసతులు కల్పించారు.