Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మగ్నా ఆసుపట్రిలో… ఆపరేషన్ ఠాగూర్…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– రాజమండ్రి మాగ్నా ప్రవేట్ ఆస్పత్రిలో వైద్యం
వికటించి బాలింత మృతి.
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.
– చేతకాని వైద్యంతో ప్రాణాలు తీస్తున్న ప్రవేటు
ఆసుపత్రుల వైద్యుల నిర్వాహం.
– మరొక ఠాగూర్ సినిమా మళ్ళీ రిపీట్ చేసిన " మాగ్నా" వైద్య
యాజమాన్యం.
– ఆపరేషన్ కి వస్తే… అనంతలోకాలో కలిపేశారని
బంధువులు వే(వా) దన""
– ఓ బాలింత ప్రాణానికి ఖరీదు కట్టుతున్న రాజకీయ
ప్రముఖులు.
– ఫ్యామిలీ ప్లానింగ్ వైద్యం వికటించి నిండు ప్రాణాన్ని బలికొన్నారని రోదన.
– ఆపరేషన్ పూర్తయి బయటకు వచ్చిన బాధితురాలు
మత్తులో ఉందని చెప్పిన వైద్య సిబ్బంది.
– బాధితురాలు మేక్కోకపోవడంతో
వైద్య సిబ్బంది అరుణ భర్త బంధువులకు తెలియకుండా అంబులెన్స్ లో డెల్టా హాస్పిటల్ కి తరలింపు.
– అక్కడ అరగంట ఐసీయూ లో ఉంచి అనంతరం మృతి చెందిందని నిర్ధారించిన వైద్యాధికారులు, సిబ్బంది
– ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు
తీసుకోవాలని బంధువులు, స్థానిక ప్రజలు డిమాండ్.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం ( విశ్వం వాయిస్ న్యూస్ )

19;- ఓ చిన్నారికి జన్మనిచ్చింది ఓ తల్లి. ఆ బిడ్డను ఉన్నత మైన శిఖరాలకు ఎదగాలని అందుకు యంత కష్టమైనా భరించి ప్రయోజికులను చేయాలనుకుని కలలు కన్నారు ఆ తల్లి దండ్రి. అయితే ఆమె బాలింత కావడంతో చిన్న ఆపరేషన్ చేయించుకుందామని రాజమండ్రి లోని మాగ్నా అనే ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరింది. కానీ అక్కడి వైద్యుల నిర్వాకం తప్పుడు వైద్యంతో కానరాని లోకాలకు పంపించేశారు. ఆ ఆసుపత్రి తప్పుడు ఆపరేషన్ చేయడమే కాకుండా మృతి చెందిన ఆ మహిళను బతికే ఉందని చెపుతూ వేరే ఆసుపత్రిలో ఐ సియు లో పెట్టి అరగంట సేపు వైద్యం చేసినట్లు హడావుడి చేశారట వేరే ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని ఆ విషయం కూడా బాధితురాలి భర్తకు, బంధువులకు తెలియకుండానే వైద్య సిబ్బంది చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరికి ఆపరేషన్ చేశారు వారు బాగానే వున్నప్పటికీ ఈ మహిళను మాత్రం తప్పుడు వైద్యం చేసి చంపేశారని బంధువులు అంటున్నారు. ఈ విషయం జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికి సదరు ఆసుపత్రి యాజమాన్యంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మీడియాకు కూడా పొక్కకుండా మాగ్నా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్త పడ్డారు. యట్టకేలకు ఈ విషయం ఆ నోట, ఈ నోట పొక్కుతూ బయట పడ్డది. మృతురాలి బంధువులు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో మీడియాని ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులు జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నారు.

 

* అసలు ఏమి జరిగిందంటే..?

 

గోకవరం మండలం, ఎం. మల్లవరం గ్రామానికి చెందిన అరుణ ( 21 ) మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో రాజమహేంద్రవరం మాగ్నా తల్లి పిల్ల హాస్పిటల్ కు చిన్న ఆపరేషన్ ( ఫ్యామిలీ ప్లానింగ్ ) చేసుకునేందుకు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది ఐ. సి. యు వార్డులోకి ఆపరేషన్ చేసేందుకు వైద్య సిబ్బంది తీసుకువెళ్లారు. ఆపరేషన్ అనంతరం మహిళలు బయటకు తీసుకు వచ్చారు. అరుణతో ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరు మహిళలు మేల్కొని వారి బంధువులతో మాట్లాడుతుండగా అరుణ ఆపరేషన్ చేసినప్పటికీ ఎంతకీ మత్తు నుంచి ఎంతకీ మేల్కోకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి ఆసుపత్రి సిబ్బంది కి తెలియజేశారు. మత్తులో ఉంది కొద్దిసేపటికి మేల్కోంటుందని ఆసుపత్రి సిబ్బంది బంధువులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అరుణ మేలుకో కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది గట్టిగా నిలదీశారు.

వైద్య సిబ్బంది అరుణ భర్త బంధువులకు తెలియకుండా అంబులెన్స్ లో డెల్టా హాస్పిటల్ కు తరలించి అక్కడ అరగంట ఐసియు లో ఉంచి అనంతరం మృతి చెందిందని నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి తీసుకుపోలని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న మహిళను తీసుకువచ్చి చిన్న ఆపరేషన్ నిమిత్తం చేర్చిన తమకు మృతదేహం అప్పగించారంటూ మృతురాలి భర్త, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

* మృతదేహంతో బైటాయింపు..

 

మాగ్న ఆసుపత్రి వైధ్యులు చేసిన నిర్వకానికి మృతురాలి బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ముందే బైటాయించారు. అరుణ మరణానికి కారకులైన వైద్యులను, యాజమాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కఠిన మైన చర్యలు తీసుకోవాలని డిమాం చేశారు.

అనంతరం హాస్పిటల్ లో మృతదేహంతో బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement