గాయపడిన వ్యక్తులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్ ):
కోనసీమ జిల్లా జొన్నాడ గౌతమి బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అయినట్లు హైవే పెట్రోలింగ్ అధికారులు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా కవిటం (పాలకొల్లు) నుండి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య భర్తను అదే వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. కాగా క్షతగాత్రులను హైవే అంబులెన్స్ పై ఆస్పత్రికి తరలించారు. గౌతమి బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో ఇరువైపులా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలమూరు, రావులపాలెం పోలీసుల ఆధ్వర్యంలో హైవే సిబ్బంది ట్రాఫిక్ నియంత్రించారు.