Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కు చుక్కెదురు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

మండలంలో చిరుత పూడి గ్రామపంచాయతీలో చిట్టి చెరువు గట్టు, రాజీవ్ కాలనీలో సొంత సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కాలనీ లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు నిరసన సెగ

ఎదురయ్యింది. తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ మహిళలు గ్రామస్తులు ఎస్సీ లకు చెందిన పథకాలను ఎందుకు రద్దు చేశారని ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు చెందాల్సిన 27 పథకాలను ఎందుకు రద్దుకు చేశారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ప్రశ్నించారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా మా ఊరు ఎందుకు వచ్చారని మహిళలు గ్రామస్తులు ఎమ్మెల్యేని నిలదీశారు . ఎస్సీ ఓట్లతో గెలిచిన మీరు సమాధానం చెప్పి తీరాలని ఎమ్మెల్యే ను నిలదీశారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అక్కడ నుండి వెనుదిరిగారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement