Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ.పోలవరం విశ్వం వాయిస్ న్యూస్:

ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ కరపత్రాల పంపిణీ కార్యక్రమం ఐ పోలవరం మండలం ఇంచార్జ్ కే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ సంయుక్తంగా బీఎస్పీ కరపత్రాలను దాదాపు 800 మందికి పంచడం జరిగింది. మొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల నరసింహ పూలమాల అలంకరణ చేసి తరువాత బీఎస్పీ కరపత్రాలను వివిధ గ్రామాల నుండి సంతకు వచ్చిన ప్రజానీకానికి, వర్తకులకు పంచడం జరిగింది. మండలంలో కొంతమంది పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా వారిని ఆహ్వానించి జిల్లా అధ్యక్షులు బిఎస్పి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

 

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల నరసింహ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు పై ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా బి ఎస్ పి ప్రెసిడెంట్ కాండ్రేగుల నరసింహం,జిల్లా జనరల్ సెక్రటరీ ఎం. గౌతమ్ అశోక్, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ వాకపల్లి భీమారావు, అసెంబ్లీ ప్రెసిడెంట్ కాశీ లక్ష్మీ భవాని, వైస్ ప్రెసిడెంట్ బడుగు భీమేష్, కోటేశ్వరరావు, తాళ్లరేవు ఇంచార్జ్ కప్పల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ పాము శ్రీను తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement