Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అక్రమ కట్టడాలు తొలగింపు””స్పీడ్ పెంచిన అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం రింగ్ రోడ్ లో అక్రమాల తొలగింపులో
సందిగ్ధత
భవనాలపై మార్కెటింగ్ ఇచ్చిన అధికారులు
తొలగింపుకు మాత్రం మీనమేషాల లెక్కింపు
రావులపాలెంలో రాజకీయ నాయకులకు అధికారులు
ఎప్పుడు తలోగ్గుతు ఉంటారా.
రావులపాలెం డబ్బు ఉంటే ఏమైనా చేయ్యగలం
అనటానికి మరొక నిదర్శనం ఈఅక్రమనాల తొలగింపు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యకు
పరిష్కారం చూపి ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానులే
అని నిరూపిస్తారో లేదో చూద్దాం.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్)

రావులపాలెం రింగ్ రోడ్డులో అక్రమణల తొలగింపు సందిగ్ధంలో పడింది. లోకాయుక్తలో చేసిన ఫిర్యాదు నేపథ్యంలో లోకాయుక్త నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన సర్వేయర్లు పక్కా భవనాలు కూడా ఆక్రమణల్లో ఉన్నాయని నిర్ధారిస్తూ మార్కింగ్ ఇచ్చారు. ఆ లెక్కన కొన్ని భవనాలు 50 శాతం నుంచి 75 శాతం వరకు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన తహశీల్దార్ సత్యనారాయణ, ఆర్ అండ్ బి జేఈ మణికుమార్, గ్రామ కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితర అధికారుల బృందం స్థానిక జెడ్పీ బాలికల హైస్కూల్ వద్ద నుంచి ఊబలంక రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ఉన్న రింగ్ రోడ్డులో అక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. దీంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అయింది. ఎన్నో ఏళ్ళుగా ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురి కావడంతో ట్రాఫిక్ , పార్కింగ్ సమస్యలు ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో అధికారులు చేపట్టిన చర్యలను అంతా ఆహ్వానించారు. అయితే అప్పటికే పలు మార్లు నోటీసులు ఇచ్చామని చెప్పిన అధికారులు ఆరోజు కేవలం రేకు షెడ్డులు, భవనాలు, షాపుల ముందు ఉన్న తాత్కాలిక పందిళ్ళు మాత్రమే తొలగించి చేతులు దులుపుకోవడం ఆశ్చర్యం కలిగించింది. భవన యజమానులకు స్వచ్చందంగా తొలగించుకునే అవకాశం ఇచ్చామని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఇది జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా మళ్ళీ అధికారులు ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రావులపాలెం రింగ్ రోడ్ (ఆర్ అండ్ బి) స్థలాన్ని ఇరువైపుల భవనాలు, దుకాణాల యజమానులు ఆక్రమించి ప్రభుత్వ భూమిలో దుకాణాలు, పక్కా భవనాలు, రేకుల షెడ్లు నిర్మించారని లోకాయుక్త లో రావులపాలెంనకు చెందిన కొవ్వూరి గంగిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, దీనిపై తీసుకున్న చర్యలు ఏంటి అని ఆర్ అండ్ బి, తహసీల్ధార్ లను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా లోకాయుక్త ఆదేశించిన నేపథ్యంలో ప్రారంభించిన ఆక్రమణల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లు, తాయిలాల పంపకాలు భారీ స్థాయిలో జరగడంతో అధికారులు వెనక్కి తగ్గారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి ఎక్కడి వరకు ఉంది అనే దానిపై గతంలో సర్వే జరిపి, పక్క భవనాలపై కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. మార్కింగ్ ఇచ్చినప్పుడు గుర్తించిన ప్రభుత్వ భూమి, భవనాలు తొలగించాల్సిన సమయంలో అధికారులు మౌనం వహించడం వెనుక ఏం జరిగిందనేది జగమెరిగిన సత్యమే. ఆయా ఆక్రమణదారులు అధికారులకు ఎంత ముట్ట జెప్పారు, ఏం స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయనేది ప్రజలకు ప్రశ్నర్ధకం గా మారింది. దీనిపై వివరణ కోసం తహసీల్ధార్ ను సంప్రదిస్తే, మాకేం తెలియదు ఆర్ అండ్ బి జేఈ నోటీసు ఇస్తే తాము సహకరించామని, మాకేం సంబంధం లేదు అని చెప్పారు. ఆర్ అండ్ బి జేఈని అడిగితే, నాకేం సంబంధం, భూములు అనే సరికి రెవిన్యూ అధికారులకు సంబంధం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవన యజమానులు తమ భవనాలను కూల్చకుండా ఉండేందుకు అధికారులకు భారీగానే ముట్టజెప్పారు అనే ప్రచారం ఆ నోటా ఈ నోటా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా వివరణ ఇవ్వవలసిన తహసీల్ధార్ మార్కింగ్ ఇచ్చిన తరువాత భవనాలను తొలగించకుండా ఉండడం వెనుక ఏదో జరిగింది అనేది మాత్రం జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రజల అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం అధికారులపై ఉంది అనడంలో సందేహం లేదు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement