Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ భూమి కోసం పోరాటం””అన్నం పెట్టే భూమి కోసం ఆరాటం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మా భూముల జోలికొస్తే ఊరుకోము.
ప్రాణాలిచ్చయినా కాపాడుకుంటాము.
తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు మోసం చేశారు.
పంట కోస్తుంటే టిడిపి కార్యకర్తలు అడ్డగించు.
* డి. ఎస్. పి రాకతో ఆందోళన విరమణ.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పిఠాపురం:

 

కాకినాడ జిల్లా /పిఠాపురం ( విశ్వం వాయిస్)

తాము 70సంవత్సరాలనుండి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని,52సంవత్సరాలు పన్నులు చెల్లెస్తున్నామని, వరి పంట చేతికొస్తే కోసుకుంటుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుతగులుతున్నారని బాధిత రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెలితే… కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన సర్వేనంబర్ 627/2,627/2,628/1,628/2లో పాత కొత్త చెరువులు 52ఎకరాలు ప్రభుత్వ భూమి 70సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ,52సంవత్సరాల నుండి పంచాయతీ కి పన్నుకడుతున్నారు. ఒకప్పుడు తుప్పలు, దొంకలతో వున్నా భూమిని, కష్టించి సాగులోకి తెచ్చుకున్నారు. ఈ భూమిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్. వి. ఎస్. ఎన్. వర్మ రిటైర్డ్ తహసీల్దార్ రత్నకుమారి తో మామూళ్ళ మాయాజాలంతో రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు. అలాగే ప్రస్తుత తహసీల్దార్ శివ కుమార్ ను మామూళ్ళాతో లొంగధీసుకుని, పోజీసన్లో మేము లేనట్లు తప్పుడు నివేదికలు అధికార్లకు, కోర్టుకు పంపించి మమ్మల్ని నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. మేము వరినాట్లు వేసుకుంటే ఏడుగురు గడ్డి మందు కొట్టి వరినాట్లు చంపేస్తే పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చావైనా బ్రతుకైనా ఇక్కడే అని తేల్చి చెప్పారు. వరి కోస్తుండగా టీడీపీ కార్యకర్తలు నూతాటి ప్రకాష్, వేమగిరి రాంబాబు, పల్ల రాజబాబు, గెడ్డం రామస్వామి (పిట్లు )తదితరులు వచ్చి వరి కోతను అడ్డుకున్నారు. దీంతో రైతు కూలీలకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్. ఐ అబ్దుల్ నబీ తన సిబ్బంది తో వచ్చిన, సీఐ వచ్చిన ఆందోళన విరామిచ్చకపోవడంతో డి. ఎస్. పి. మురళీ కృష్ణా రెడ్డి వచ్చి మాట్లాడుతూ, కోర్టు లో పెండింగు లో కేసు ఉన్నందున తీర్పు వచ్చే వరకు ఎవరు వెళ్ళవద్దని చెప్పారు. బాధిత రైతు కూలీలు మాట్లాడుతూ, పంట చేతికొచ్చిందని, ఈ విషయం రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తో విన్నావుంచుకోగా కాకినాడ కలెక్టర్ కృతికా శుక్ల, తహసీల్దార్ శివ కుమార్ లకు ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. డి. ఎస్. పి మాట్లాడుతూ, కలెక్టర్ ను కలసి మీ ఇబ్బందులు చెప్పుకోవాలని, కోర్టు సెలవులు వున్నా అత్యవసర పరిస్థితిలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని, నేను ఈ విషయం కలెక్టర్ దృష్ధికి తీసుకెళతానన్నారు. దీంతో రైతు కూలీలు ఆందోళన విరామయించ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement