విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె. రమేష్ స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని పర్యవేక్షించారు.నాణ్యతా ప్రమాణాలు ఆరా తీశారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత గాంధీనగర్ లో షటిల్ కోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. జగన్నాధపురం మహాలక్ష్మి నగర్ లో ఆధునిక స్లాటర్ హౌస్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం యాళ్లవారి గరువులోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను ఆరా తీసారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాళ్ళ వారి గరువు సమీపంలోని స్మశాన వాటికలో ఆధునికపద్దతిలో దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేస్తున్న గ్యాస్ ప్లాంట్ ను కమిషనర్ పరిశీలించారు.శునకాలకు ఆపరేషన్లు చేసే ఏ బి సి కేంద్రాన్ని సందర్శించారు. చర్చి స్క్వేర్ బాలికోన్నత పాఠశాల,బోట్ బిల్డింగ్ యార్డ్ ను సందర్శించి పనుల ప్రగతిని ఆరా తీశారు. జగన్నాధపురం శివాలయం సమీపంలో ప్రతిపాదించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను కూడా పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్తను సేకరణ తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రజలంతా యూజర్ చార్జీలు చెల్లించాలని కమిషనర్ కోరారు.ఆయన వెంట స్మార్ట్ సిటీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు అధికారులు ఉన్నారు.