విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
తేది 20.05.2022 మండపేట అర్బన్ (విశ్వ0 వాయిస్)
స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో మినీ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర పార్టీ నాయకులు, మాజీ మంత్రి వర్యులు యనమల కృష్ణుడు,మాజీ ఎమ్మెల్సీ వి వి వి ఎస్ చౌదరి ( కుర్మాపురం అబ్బు ) లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఈ నెల 27,28 తేదిలలో ఒంగోలులో జరుగు మహానాడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దానికి నిదర్శనమే గడప గడప కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లను ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్నారని అన్నారు. మాజీ మంత్రి వర్యులు
యనమల కృష్ణుడు మాట్లాడుతూ బూత్ ల వారీగా పార్టీ కి మంచివారిని ఎంపిక చేయాలని వాటిని క్లస్టర్ వారీగా తీసుకుని పర్యవేక్షకులను నియమించుకోవాలని సూచించారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం అందరం కలిసి దీటుగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలని మాజీ ఎమ్మెల్సీ కుర్మాపురం అబ్బు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ సభ్యులుగా నియమించబడిన చుండ్రు శ్రీ వర ప్రకాష్ (రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు), రిమ్మలపూడి వేణుగోపాల దొర (రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి), కాదా ప్రభాకరరావు (రాష్ట బి.సి.సెల్ ఉపాధ్యక్షులు), యార్లగడ్డ జాన్ సుందర్ రాజు ( రాష్ట్ర ఎస్.సి.సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి), కొప్పిశెట్టి వాసు (రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్), వాదా ప్రసాద రావు ( రాష్ట్ర టి.ఎన్. టి .యు .సి అధికార ప్రతినిధి), షేక్ మౌలానా(రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి), సల్మాన్ హుస్సేన్ (రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి), వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరా, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు వర ప్రకాష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ,రెడ్డి ప్రసాద్, కాదా ప్రభాకరరావు, షేక్ మౌలాలి,సల్మాన్,కొప్పిరెడ్డి వాసు,పుచ్చల శ్రీను,ఉంగరాల రాంబాబు, కొలుపోటి బాబు, ముత్యాల వెంకట్రావు, యరగతపు బాబ్జి,కొప్పిశెట్టి మాధవరావు,ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శిలు,నాయకులు, వార్డ్ మెంబర్స్, మున్సిపల్ కౌన్సెలెర్స్,పట్టణ పార్టీ నాయకులు అధిక సంఖ్యలోకార్యకర్తలు పాల్గొన్నారు.