Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అనంతయ్య ఏం జరిగిందిఅయ్యా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పాలకులే పాశకులైతే..
ఆ ప్రాణానికి రక్షణ ఉంటుందా?"
గోదావరి జిల్లాలో వైసిపి పార్టీ పరువు
గంగలో మిక్సింగ్
ఎమ్మెల్సీ అనంత బాబు పదవి ఉంటుందో.. ఊడుతుందో?
దీని ప్రభావం వచ్చే ఎలక్షన్లో ఉంటుందా.. సీఎం
నిర్ణయం ఏమిటో?
బాబు కి ఉమ నైజర్… గజ తాగుబోతు అంటూ
బిరుదులు ఉన్నాయంట నిజమేనా?
నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న అనంత బాబు..
మృతుని తల్లిదండ్రులు
ఇటువంటి నాయకులకే పదవులు కట్టబెట్టిన జగన్..
ప్రతిపక్షం ఆరోపణ
డ్రైవర్ కి బాబు అవినీతి బాగోతం మొత్తం తెలుసా?
మృతదేహం వద్ద ఉద్రిక్తత.. ప్రతిపక్షం, ప్రజా సంఘాలు
మద్దతు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం(24) మృతి స్థానికంగా కలకలం రేపింది. సుబ్రమణ్యం మృతికి అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) కారణమంటూ మృతుని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అనంత బాబు వద్ద సుమారు ఐదేళ్లు గా సుబ్రహ్మణ్యం డ్రైవర్ గా పనిచేస్తూ 5నెలల నుండి ఉద్యోగానికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగం మానేసి నా అనంత బాబు 20 వేల రూపాయలు బకాయి ఉందని, డబ్బులు చెల్లించాలని సుబ్రహ్మణ్యంను బాబు పదే పదే ఫోన్లో మాట్లాడే వారిని, లేనిపక్షంలో కాలు, జెబ్బా తీసేస్తాను అంటూ బెదిరింపులు చేసేవాడని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో అనంత బాబు గురువారం అనగా నిన్నటి రాత్రి పుట్టినరోజు వేడుకలు అంటూ తీసుకెళ్లినట్లు ఫోను ద్వారా సుబ్రహ్మణ్యం తమకు సమాచారం ఇచ్చారన్నారు. తాము సుబ్రమణ్యంనకు మరల ఫోన్ చేయగా వచ్చేస్తున్నానని ఫోనులో బదులిచ్చినట్లు తల్లిదండ్రులు చెప్పారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో ఎమ్మెల్సీ అనంత బాబు ఫోన్ చేసి మీ కుమారుడు మోటార్ బైక్ పై వెళుతుండగా నాగమల్లితోట జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని అందులో మరణించారని చెప్పడంతో దిక్కుతోచలేదన్నారు. మృతదేహంతో తన కారులో తాము ఉంటున్న రాజాట్యాంక్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వద్దకు ఒంటి గంట సమయంలో తీసుకు రాగా తాము పలు ప్రశ్నలు అడిగి మృతికి కారణాలు ఏమిటి అంటూ నిలదీశామన్నారు. దీనిపై అనంత బాబు ప్రమాదం జరిగింది… తాను తీసుకు వచ్చినట్టుగా మద్యం మత్తులో బదులు ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల ఆవేదన, జనాలు గుమిగూడాడంతో కారుతో సుబ్రహ్మణ్యం మృత దేహాన్ని వదిలివేసి అక్కడి నుంచి పరారయ్యారన్నారు. అయితే మృతుడు సుబ్రహ్మణ్యం కు ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగిందని, అతని భార్య అపర్ణ మూడు నెలల గర్భవతి అని చెప్ప వచ్చారు. సంఘటన రాత్రి జరగగా శుక్రవారం తెల్లారేసరికి దళిత, రాజకీయ, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు అక్కడి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు అపార్ట్మెంట్ నుంచి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలింపునకు పూనుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ అంబులెన్స్ గాలి తీసివేయడం జరిగింది. దీంతో అక్కడ నాయకులు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసు వలయం ద్వారా మరో అంబులెన్స్ ను తీసుకువచ్చి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కొద్దిసేపటికి నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక పార్లమెంటు టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ మేయర్ సుంకర పావనిలు చేరుకున్నారు. మృతుని సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స చేయించాల్సిన అనంత బాబు మృతదేహాన్ని అపార్ట్మెంట్ వద్ద కారులో వదిలేసి పారిపోవడం ఏమిటంటూ కొండబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాంతి భద్రతలను గాలికి వదిలేయడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం మృతుని తల్లిదండ్రులతో టిడిపి నాయకుడు నారా లోకేష్ ఫోన్లో మాట్లాడించారు. మృతుని సుబ్రహ్మణ్యం కుటుంబానికి టిడిపి అండగా నిలుస్తుందని ఫోన్లో లోకేష్ చెప్పినట్లు వారు తెలిపారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం వద్దకు వివిధ దళిత, ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం వారు పోస్టుమార్టం జరిగే ప్రభుత్వ ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే అనంత బాబు పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ.. ఇటువంటి నాయకులకు జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రతిపక్షాలు ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడినందుకు గానూ ప్రాణహాని ఉందని, అందుకోసమే స్థానికంగా ఉంటున్నడంటూ కొంతమంది తెలిసినవారు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి గోదావరి జిల్లాల్లో పార్టీకి భారీ నష్టమే వాటిల్లిందని, సీఎం పార్టీ కోసం ఆలోచిస్తే ఎమ్మెల్సీ పదవి ఊడిపోతుందని మేధావి వర్గం వ్యాఖ్యానిస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని దోషులను పట్టుకుంటామని ఎఎస్పి శ్రీనివాస్ తెలిపారు. మృతుడు సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చిన కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని, ఇది నీలిమ అనే మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ కేసును సర్పవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement