Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 3:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 3:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 3:55 PM
Follow Us

అధికారుల అండతో”” మట్టి మాఫియా జోరు””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

రాయవరం ( విశ్వం వాయిస్ న్యూస్ )

– కలెక్టర్ స్పందిస్తే మాఫియాని మట్టు పెట్టినట్లే

– ఇటుక బట్టీలు తయారితో లక్షల్లో అక్రమ ధనార్జన

– సంబంధిత అధికారుల కనుసన్నల్లో ముసుగు వ్యాపారం

– అక్రమ చీకటి వ్యాపారానికి మాఫియా వారితో జత కట్టిన అధికారులు.

– మండలంలో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా చూసిచూడనట్లు రెవిన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారుల వ్యవహార శైలి.

– సోమేశ్వరం, పసలపూడి గ్రామాలలో అర్ధరాత్రి నుండే జోరుగా మట్టి తవ్వకాలు జోరు.

– రహదారిపై ట్రాక్టర్లు మట్టి లోడుతో ప్రయాణాలు.

– రోడ్డుపై పడుతున్న మట్టి గడ్డలు.

– వాహనదారులు రోడ్డుపై మట్టిగడ్డలను ఎక్కిస్తూ ప్రమాదాలు.

– ఇంత పబ్లిక్ గా జరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.

– మట్టి మాఫియా అక్రమ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్.

– జిల్లా కలెక్టర్ , డివిజన్ అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్.

20;- ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తన చూపంతా కష్టపడి పని చేసి తన కుటుంబాన్ని మాత్రమే వెళ్లదీసుకోవాలని అనుకుంటారు. సంపాదన తరువాత సంగతి అనే ధోరణిలో వుంటారు. కానీ అక్రమ వ్యాపారాలు చేసే వారు అధికారులకు మాయ మాటలు చెప్పి ధనార్జన అనే ఆశతో వారిని ఊబిలోకి ధించుతున్నారు. అక్రమ వ్యాపారం చేసే వ్యక్తి మాత్రం ప్రభుత్వ కన్ను కప్పి, అధికారులను బోల్తా కొట్టించి అడ్డ దారిలో ఎలా సంపాదించాలో పలు మార్గాలు వెతుకుంటాడు. అందులో భాగంగా ప్రభుత్వం , అధికారుల కళ్ళు కప్పి మాయ మాటలతో లంచాలు యరవేసి అధికారులను తన వ్యాపారానికి అడ్డు రాకుండా అక్రమ ధానార్జనలో ధింపుతారు. అదే ధోరణిలో కొన్ని మండల్లాల్లో ఇటు వంటి అక్రమ వ్యాపారానికిఅడ్డు రాకుండా అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని మట్టి మాఫియా యథేచ్ఛగా అధికారుల కనుసన్నల్లో నడుపుతూ లంచాలు యరవేసి తన పనులు తాను నడుపుకుంటు వెళ్తున్నారు. అక్రమ సొమ్ములు కు ఆశ పడ్డ అధికారులు తమ విధి విధానాలు మాని అక్రమ వ్యాపారం చేసే వ్యక్తితో చెయ్యి కలిపి సొమ్ములు సంపాదిస్తున్నారు. అక్రమ వ్యాపారం చేసే వ్యక్తి మాత్రం చిటికెడు సొమ్మును అధికారుల చేతుల్లో పెట్టి చాటేడు సొమ్మును దర్జాగా సంపాదించి ఆఖరికి ఆ అధికారులను తన చేతిలో పెట్టుకొని అధిక సొమ్ములు సంపాదిస్తున్నారు. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా…? వివరాల్లోకి వెళ్ళితే

 

* సొమ్ములు చెల్లించాం అడ్డేముంది.

 

మండలంలో మట్టి మాఫియా దారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో మట్టిమాపియా దారులు పోలాల్లోని మట్టిని జోరుగా ట్రాక్టర్లపై అక్రమ వ్యాపారం చేస్తున్నారు. రాత్రి వేళ వ్యాపారులు తమ దైన శైలిలో అద్దికారులతో జత కట్టి చీకటి ముసుగులో పోలాల నుండి యథేచ్ఛగా మట్టిని తీసుకెళ్తున్నారు. ముడుపులతో అద్దికారులను మత్తులో దించి తమకు అడ్డు లేకుండా .మాఫియా వ్యవహరిస్తుంది. ఈ మట్టితో ఇటుకల బట్టీలను తయారుచేసుకొని అధిక లాభాల ధానార్జనలో మాఫియా దారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం పై పలు మార్లు సంబంధిత అధికారుల దృష్టికి ప్రజలు తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన లేరని స్థానికులు అంటున్నారు.

 

* ఇలా జరుగుతున్నది.

 

రాయవరం మండలం లో జోరుగా అర్ధరాత్రి నుండే జోరుగా మట్టి తవ్వకాలు నిర్వహించారు. ట్రాక్టర్లు, లారీలు రోడ్లపై వేగంగా వెళ్లడంతో మట్టి తరలిస్తున్న లారీ ట్రాక్టర్ల అధిక లోడుతో వెళ్లడంతో మట్టి అండలు వాహనాల పై వెళుతున్న వారిపై పడుతున్నాయి… ఇంత బహిరంగంగా జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ట్లు ప్రజలు గుసగుసలు సాగుతున్నాయి…

 

* అధికారులకు తెలుసా…?

 

పొలాల్లో ఉన్న మట్టిని తియ్యలన్నా రెవిన్యూ అధికారుల పర్మిషన్ కానీ, మైనింగ్ వారి పర్మిషన్ కానీ అవసరం. కానీ పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపించినట్లు ఇక్కడ అధికారులు , మట్టి అక్రమాధారుల పరిస్థితి ఉన్నది. అధికారుల ముందే మట్టిని అక్రమంగా ట్రాక్టర్లపై తొలుకుంటూ తీసుకెళ్తుంటే ఇక్కడ అధికారులు చోద్యం చూస్తున్నారు. అసలు అక్రమంగా మట్టి తవ్వకాలు చెయ్యొచ్చ లేదా అనే విషయం కూడా అధికారులకు తెలియదేమో అనే రీతిలో మండలంలో అనుకుంటున్నారు. కానీ ముడుపుల మాటున అధికారులు అక్రమ దారులకు సహకరిస్తున్నారు అనేది అసలు విషయం ప్రజలకు అర్ధం కాని పరిస్థితులున్నాయి. కానీ వేరిరువురి మధ్య వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయని కొందరు మాత్రం గుస గుసలు చేస్తున్నారు. ఇదే జరిగితే అక్రమ వ్యాపారస్థులతో పాటు అధికారులను కూడా సస్పెండ్ చెయ్యాలని ప్రజలు అంటున్నారు.

 

* మట్టితో ఇటుకలు తయారీకి ..? సారవంతం కోల్పోతున్న పొలాలు.

 

మట్టిని అక్రమంగా పొలాల నుండి తీసుకెళ్లి ఇటుక బట్టికి ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ భూములలో సారవంత మైన మట్టిని తవ్వి ఉపయోగిస్తున్నారు. ఇలా మట్టిని తవ్వడం వలన ఆ భూముల్లో పంటలు పండే అవకాశం.లేదు. ఎందుకంటే మట్టిలో ఉన్న సాంద్రత లేకుండా పోతోంది. అందులో వుండే పోషకాలు విచ్చిన్నమవుతాయి. ఈ విషయం పై వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు తెలియక పోవడం తో అక్రమ దారులు రైతులను మభ్యపెట్టి మట్టిని తవ్వుకు పోతున్నారు.

 

* ధనార్జనే ముఖ్యం.. ప్రజల ప్రాణాలతో పనేమిటి..?

 

మట్టిని ట్రాక్టర్ల పై తీసుకెళ్లి ఒక దగ్గర కుప్పలుగా పోషి ఇటుకలు తయారు చేస్తున్నారు. ఆ ఇటుకలు అమ్ముకొని అధిక లాభాల్లో అక్రమ దారుడు వ్యాపారం చేస్తూ డబ్బులు కుప్పలు చేసుకుంటున్నాడు. మట్టిని రాత్రి సమయంలో తోలడం వలన మట్టి గడ్డలు రహదారిపై పడి బైక్ ల మీద వెళ్లేవారు, వాహనాలపై వెళ్లే ప్రయాణికులకు రాత్రి వేళ మట్టి గడ్డలు పై వాహనాలు ఎక్కిస్తూ కింద పడుతున్నారు. దీనితో గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్సాలు చేయించుకుంటున్న. కొందరి ప్రాణాలు పోయినా ఆశర్యం చెంద నవసరం లేదు. ఇలా ఒక్క మట్టి వలన ఇన్ని నష్టాలు ఉంటే ప్రభుత్వ అధికారులు అక్రమ దారులకు ఎలా సహకరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది.

 

* కలెక్టర్ స్పందిస్తే సమస్యలు కొలిక్కి

 

జిల్లా కలెక్టర్ పైన పేర్కొన్న విషయాలపై దృష్టి సారిస్తే సమస్యలు పరిస్కారం అవుతాయని అక్రమ వ్యాపారస్తులు భారతం కట్టొచ్చని, అదే విధంగా మట్టిని తొలుకు పోతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని, అధికారులను అప్రమత్తం చేస్తే మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చని, మాఫియాకు సహకరించడం చేసిన అధికారులపై కొరడా జులిపించ వచ్చని మండల ప్రజలు కలెక్టర్ ని కోరుతున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement