విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: మే21: విశ్వం వాయిస్ న్యూస్: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం
తుని మండలంలో గలఎన్.సురవరం,గాంధీ నగర్ లో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి దాడిశెట్ట రాజా పాల్గొన్నారు.ముందుగా ఎన్ సూరవరంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం 60లక్షల నిధులతో మంజూరైన అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.గ్రామసచివాలయ సిబ్బంది తో మంత్రి రాజా మాట్లాడారు.పధకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.విథకాల రూపంలో 12 కోట్ల54 లక్షల రూపాయలు ఈ గ్రామానికి లబ్ధి చేకూరినట్లు సచివాలయం సిబ్బంది మంత్రికి తెలిపారు.అనంతరం ప్రతి ఇంటికి మంత్రి చేరుకుని పధకాలు అందాయాలేదా అని గృహస్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.సాంకేతిక కారణాలతో ఆగిన పధకాలకు లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకుంటా నని మంత్రి అన్నారు.త్వరలో చెరుకు రైతులకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు .ఈయన వెంట ప్రజా ప్రతినిధులు, వైసీపి నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.