Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

పశువులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నూతనంగా ప్రారంభించిన డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక బాలాత్రిపుర సుందరి ఆలయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ నియోజకవర్గానికి కేటాయించిన డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి..నగర మేయర్ సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్ ఉదయ్ కుమార్, కూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పశుసంవర్ధక శాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ 108,104 వాహనాలు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఏవిధంగా వైద్యసేవలు అందిస్తున్నాయో అట్టిరితిగానే పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పాడి పశువులను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రులకు తరలించాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నారు. పాడిరైతులు ఇటువంటి ఇబ్బందులను అధిగమించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1962 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే ఈ వాహనం ద్వారా ప్రధాన ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పిన కేటాయించడం శుభ పరిణామమని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను పాడి రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. …అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో

డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు వంగాగీత, గ్రామీణ శాసన సభ్యులు కురసాల కన్నబాబు ఆయన క్యాంపు కార్యాలయం రమణియ్యపేట నందు పార్లమెంట్ సభ్యురాలు పశు ఆరోగ్య సేవ వాహనం(పశువుల అంబులెన్స్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement