Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రతి రైతు వివరాలు ఈ కేవైసీ చెయ్యాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లాలో ఇప్పటివరకు పూర్తి చేసిన 74.9 శాతం
– ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు వెంటనే ఆ
వివరాలు ఆన్లైన్లో నమోదు చేయ్యాలి
– రైతులకు కు చెల్లింపు కోసం రూ.318 కోట్లతో ప్రతిపాదనలు పంపాము
– జిల్లా కలెక్టర్ మాధవిలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

జిల్లాలో ప్యాడి కొనుగోళ్ల లక్ష్యాలను పూర్తి చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.

శనివారం కలెక్టర్ ఛాంబర్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ప్యాడి సేకరణపై జాయింట్ కలెక్టర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లో ఇప్పటికీ 1.97 లక్షల మెట్రిక్ టన్నుల పూర్తి చేసి ఆన్లైన్ లో నమోదు చెయ్యడం జరిగిందన్నారు. వాస్తవంగా సేకరణ జరిగిన 2.20 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇంకా ఆన్లైన్ లో మిల్లర్లు నమోదు చెయ్యవలసిన 24 వేల మెట్రిక్ టన్నుల వివరాలు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క రైతు వివరాలు ఈ కే వై సీ పూర్తి చెయ్యమని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. జిల్లాలోని లక్ష్యాల లో 74.9 శాతం పూర్తి చేశారన్నారు. ఇంకా 17,011 మంది రైతుల

ఈ కే వై సీ చెయ్యాల్సి ఉందన్నారు. బిక్కవోలు, అనపర్తి, ఉండ్రాజవరం, సీతానగరం మండలాల్లో పెండింగ్ ఎక్కువగా ఉందన్నారు. కేవలం ప్యాడి పండించే రైతు లవే కాకుండా వ్యవసాయ రంగం లో ఉండే ప్రతి రైతు ఈ కే వై సీ తప్పనిసరి అన్నారు.

రబీ పంట కోతలు జిల్లాలో పూర్తి అయ్యిందని, రైతుల నుంచి 75 రోజుల వరకు అర్భికెలు ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు ఉందని జిల్లాజాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తెలిపారు. మిల్లుకు చేరిన ధాన్యంకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మిల్లర్లు రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేస్తే 21 రోజుల్లోగా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటికే రైతులకు చెల్లింపులు కోసం రూ.318 కోట్లకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. మిల్లర్ ల వద్ద కి చేరిన మిగిలిన ధాన్యం వివరాలు కూడా వెంటనే నమోదు చేయాలన్నారు. కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ లోని లక్ష్యాల లో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల లో 24 వేల మెట్రిక్ టన్నుల చేరడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, జిల్లావ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, డి ఎస్ ఓ ప్రసాద్, సహాయ మేనేజర్ రమణ, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement