Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కారం దిశగా…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– మే 23 న గోపాలపురం నియోజక వర్గంలో లో స్పందన కార్యక్రమం
– ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్న 1.00 వరకు దరఖాస్తులు స్వీకరణ
– కలెక్టర్ డా. కె. మాధవిలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం ( విశ్వం వాయిస్ న్యూస్ )

నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోకవర్గం లో మే 23 సోమవారం మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ , ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం దిశగా ప్రతి రెండు వారాల్లో ఒకవారం జిల్లా ప్రధాన కార్యాలయంలో, మరో వారం నియోజవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

అందులో భాగంగా మే 23 వ తేదీ సోమవారం గోపాలపురం నియోజకవర్గం లో స్పందన ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు గోపాలపురం లో జరిగే స్పందన కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నల్లజెర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలకు చెందిన ప్రజలు కోసం మాత్రమే ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందున ప్రజలు గమనించాలని కలెక్టర్ మాధవీలత కోరారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్థానిక ఎంపిడిఓ కార్యాలయం లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

*జిల్లా కలెక్టరేట్ లో స్పందన*

జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి యధాతధంగా స్పందన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం లో ప్రజలు నుండి డిఆర్ఓ, సంబంధించిన శాఖ రెండోవ స్థాయి అధికారులు ఆధ్వర్యంలో స్థానిక ప్రజల నుంచి యధాతధంగా స్పందన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement