అంశాలు గుర్తించుకోవాలి
– బుధవారం నాటికి రివైజ్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
– కమ్యూనిటీ కాంట్రాక్టర్లతో పనులు చేపట్టాలి
– జిల్లా కలెక్టర్ మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
పాఠశాలలో అదనపు తరగతి గదులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి పూర్తి అవ్వాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ చాంబర్ నుండి మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ జూమ్కాన్ఫరెన్స్ ద్వారా “నాడు నేడు ” పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలో చేపడుతున్న నాడు నేడు నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి పనులను పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఎమ్ ఈ ఓ లు మనస్సు పెట్టి పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా స్కూళ్ళల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి ఏమైనా మార్పు చేసే ప్రతిపాదనలు ఉంటే వెంటనే సమర్పించాలన్నారు. 1 నుంచి 3 వ తరగతులు అంగన్వాడి కేంద్రాల్లో , 3 నుండి 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ఈ విషయంలో మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలను తనిఖీ చేసి సమర్పించాలన్నారు . బుదవారం విసి నిర్వహించే సమయానికి పూర్తి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో సరిపడే మౌలిక వసతులు తరగతి గదులు పరిశీలన చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో కలిపే వాటి విషయంలోనూ సమగ్ర నివేదికలను బుధవారం అందజేయాలన్నారు. అదనపు తరగతి గదులు అవసరం లేని చోట్ల కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రజా ప్రతినిదులు నుంచి ఎటువంటి సందర్భం లోనూ మాకు అదనపు తరగతి గదులు మంజూరు కాలేదన్న ఫిర్యాదు రాకుండా చూడాలని పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాల విషయంలో శాశ్వత భవనాల అద్దె భవనాలు వివరాలను ఐసిడిఎస్ అధికారులు కలిసి సమగ్ర నివేదిక చేయాలన్నారు. నిర్మాణ పనులను చేసేందుకు అవసరమైన ఇసుక, స్టీలు, సిమెంటు వివరాల బాధ్యత సంబంధించిన ఏజెన్సీలదే అన్నారు. ఇసుక కోసం జెపి ఏజెన్సీ తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు అంచనా సరిగ్గా వేసుకుని ఉండాలని, రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కమ్యూనీటి కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఖర్చులు నమోదు భాధ్యత తీసుకో వాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో వచ్చే వారం ఇదే రోజున ఒక పని ప్రారంభించా లన్నారు.
జిల్లా విద్యాధికారి ఎస్. అబ్రహం జూమ్కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.