Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైఎస్అర్ సంచార పశు వైద్యశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– పాడి రైతులకు అండగా అ నియోజకవర్గానికి ఒక పశువుల అంబులెన్స్ సిద్దం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:

 

కోనసీమ జిల్లా, విశ్వం వాయిస్ః

కొత్తపేట నియోజక వర్గం మండల కేంద్రమైన రావులపాలెం గ్రామంలో ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చేతులమీదుగా డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశువైద్యశాలను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడలో ముఖ్యమైన మూగజీవాలకు అండగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలను మన నియోజకవర్గానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల ఆంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మొదటి విడతలో రూ.143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌లు సిద్దమయ్యాయి అని నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంబులెన్స్ కేటాయించారని,రెండో దశలో మరో అంబులెన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు.టోల్ ఫ్రీ నెంబర్ 1962 ద్వారా పశు అనారోగ్య సమాచారం తెలిస్తే వెంటనే రైతుఇంటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారన్నారు.ఈ అంబులెన్స్ లో పశు వైద్యుడు,వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ అందుబాటులో ఉంటారన్నారు 104 ,108 అంబులెన్సులు తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్ అంబులెన్స్ లో ల్యాబరేటరీ క్లినిక్స్ లా పనిచేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు, ఆలమూరు పశుసంవర్ధక శాఖా ఏడిద డాక్టర్ ఎల్ అనిత, ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ చైర్మన్ ఈదల శ్రీనివాస్ చౌదరి, ఆలమూరు మండలం పశు వైద్యులు డాక్టర్ భానుప్రసాద్, తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement