విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడలో ఆర్పీలు, సిఓలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహరావు పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్‌సిటీ కార్యాలయంలో శనివారం సి వోలు, ఆర్పీలతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, సంక్షేమ పథకాలు అమలు, సంఘాలు, సమాఖ్యల పటిష్టవంతం, బ్యాంక్ లింకేజీలు తదితర అంశాలపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడీసీ మాట్లాడుతూ ఆసరా, సున్నా వడ్డీ, టిడ్కో రుణాలు, అందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులకు ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసే విషయంలో రోజువారి కార్యకలాపాలు కొనసాగిస్తూనే పథకాల అమలుపై కూడా ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. ఎటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని ఏడీసీ కోరారు. మెప్మాపీడీ ప్రియంవద మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు,ప్ల్లమ్ సమైక్యలు, పట్టణ సమాఖ్యల నెలవారీ సమావేశాలను విధిగా నిర్వహించాలన్నారు. పొదుపు, రుణాలు వంటి ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు జూన్ నెల నుంచి ఆడిట్ ప్రక్రియ నిర్వహించి గ్రేడింగ్‌లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఆరోగ్యాధికారి డాక్టర్ ఫృద్వీచరణ్, సీఎంఎం లు సయ్యద్‌హుస్సేన్, పద్మావతి, జిల్లా స్పెషలిస్ట్‌లు, పీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.