ముద్దాయి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను వెంటనే
అరెస్ట్ చేయాలి. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్
రెడ్డి సుబ్రమణ్యం.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం అర్బన్ ( విశ్వం వాయిస్ )
కాకినాడ పట్టణం లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన మృతిని పూర్వపు యజమాని వైసీపీఎమ్మెల్సీ ఉదయ్ అనంత భాస్కర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్, ఆ పార్టి రామచంద్రపురం ఇంచార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.రామచంద్రపురం పట్టణం లో గల నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ర్యాలీగా డాక్టరు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చారు.అనంతరం శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కాకినాడ లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ముద్దాయి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేర చరిత్ర కలిగిన ఉదయ్ భాస్కర్ ను పెద్దలు సభ అయన ఎమ్మెల్సీ కి పంపడం సీఎం జగన్ ను రెడ్డి సుబ్రహ్మణ్యం తప్పుపట్టారు. అధికార వైసీపీ ఎమ్ ఎల్ సీ గా తాను ఏమీ చేసిన అడిగే వారు ఉండరని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి ప్రమాద మరణంగా అనంత ఉదయ్ భాస్కర్ నమ్మశక్యం గాని కట్టు కథ అల్లారని రెడ్డి సుబ్రహ్మణ్యం విమర్శించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను శిక్షించే వరకూ తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తుందని రెడ్డి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి వీరభద్ర రావు, కడియాల రాఘవన్, పెంకే సాంబ శివ రావు, అక్కల రిస్వింత్ రాయ్, వనం చంటి బాబు, ఖండవిల్లి విజయ రాజు, మేడిశెట్టి సూర్య నారాయణ, జాస్తి విజయ లక్ష్మి, వంజరపు రాజేశ్వరి, ఎస్. రాశి, ఎస్. వనిత అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.