Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్ విగ్రహా ఆవిష్కరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

భారత ఉప ప్రధాని , సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ అంబాజీపేట బస్టాండ్ ఎదురుగా ఆదివారం రాత్రి బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎంపీ నందిగామ సురేష్ కి కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం దగ్గర నుండి అంబాజీపేట వరకు అడుగడుగునా ఆయన అభిమానులు, దళిత నాయకులు, వైయస్సార్ సిపి నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగామ సురేష్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా, దేశం కోసం అంకితభావంతో పని చేశారని కొనియాడారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత ఆధ్వర్యంలో ఘనంగా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు , ఎంపిటిసిలు, గ్రామ సర్పంచులు, జడ్పీటీసీలు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కోనసీమ నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్ ఐ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement