విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
శంఖవరం, మే 22, (విశ్వం వాయిస్ న్యూస్) ;
కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది ఇండియా పోస్ట్.
భారత తపాల శాఖలో నగదు పొదుపు ఖాతా ఉన్న వారి కోసం అంతర్జాల ఆదారిత నగదు బదిలీ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తపాలా శాగలో నగదు పొదుపు ఖాతాదారులు చాలా కాలంగా ఈ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి ఖాతాదారులు చాలా కాలంగా కోరుతున్న సదుపాయం ఇది. మొత్తానికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై ఇండియా పోస్ట్ అధికారికంగా ఈ సమాచారాన్ని వినియోగ దారులకు ఇవ్వలేదు. కానీ కొందరు కస్టమర్లు ఇప్పటికే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండియా పోస్ట్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. కానీ కొత్త సర్వీస్‌తో కేవలం ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి భారతదేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కైనా డబ్బులు పంపొచ్చు.
ఇండియా పోస్ట్‌కు దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 44 లక్షలకు పైగా, తెలంగాణలో 93 లక్షలకు పైగా సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఉండటం విశేషం. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఇప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అయితే ఈ సదుపాయం అకౌంట్ హోల్డర్స్ అందరికీ వచ్చిందా? లేక కొందరికి మాత్రమే అందుబాటులో ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారు ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ హోల్డర్ల పాస్‌బుక్ పైన ఈ ఐడీ ఉంటుంది. ఈ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు పిన్ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌హోల్డర్స్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.
ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ 2017 లో ప్రారంభమైంది. ఈ సేవింగ్స్ అకౌంట్‌తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. బిల్ పేమెంట్, టికెట్ బుకింగ్ లాంటి సేవల్ని కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఒక రోజులో యూపీఐ ద్వారా రూ.20,000, నెఫ్ట్ ద్వారా రూ.1,00,000, ఐఎంపీఎస్ ద్వారా రూ.2,00,000, ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.5,00,000 వరకు డబ్బులు పంపొచ్చు.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు కూడా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకింగ్ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఐపీపీబీ సేవింగ్స్ అకౌంట్‌ను ఇంటి దగ్గర ఉచితంగా ఓపెన్ చేయొచ్చు. డోర్‌స్టెప్ సేవల్ని కూడా పొందొచ్చు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, బిల్ పేమెంట్ లాంటి సేవల్నీ ఇంటి దగ్గరే లభిస్తాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి అవసరం లేదు. ఈ అకౌంట్‌ను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు లింక్ చేయొచ్చు.