Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ని వెంటనే అరెస్టు చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట, విశ్వం వాయిస్ న్యూస్:

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వద్ద గతంలో కారు డ్రైవర్ గా పని చేసిన వీధి సుబ్రహ్మణ్యం ను దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణమే అరెస్టు చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజక వర్గ ఇన్ చార్జి దూలి జయరాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని పోలీసు స్టేషన్ వీధిలో ఉన్న సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ఆయన దళిత నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన మాదిగ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు డోకుబుర్ర రాజబాబు, జిల్లా అధ్యక్షుడు తాతపూడి వెంకటేష్ మాదిగలు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు ఒక దళితున్ని అన్యాయంగా హత్య చేసి, ఆ కేసును తారుమారు చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించి అనంత బాబుని బర్తరఫ్ చేయాలని, ఈ కేసు విషయంలో సమగ్ర దర్యాప్తు చేపట్టి అనంత బాబుని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. మహాజన సోషలిస్టు పార్టీ ఇన్ చార్జి దూలి జయరాజు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకూ పార్టీ అగ్రవర్ణ నాయకులు దళితులపై అతి దారుణంగా దాడులు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. చుండూరు, కారంచేడు సంఘటనలని తరచూ గుర్తు చేసే విధంగా నాయకుల తీరు ఉందన్నారు. ఏ దళితులైతే నమ్మి అధికారం కట్టబెట్టారో ఆ దళితుల మీదే అరాచకాలు సృష్టించడం బాధాకరంగా ఉందన్నారు. ఈ విధమైన దాడులు దళితులను పూర్వ స్థితికి నెట్టే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వెనక ఎమ్మెల్సీ అనంతబాబుకి చెందిన ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నాయన్నారు. దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని మండి పడ్డారు. ఈ హత్య కేసు విషయంలో తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. మృతుడి భార్య, బంధువుల పట్ల పోలీసుల వ్యవహార శైలి అతి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణి అని చూడకుండా మహిళా పోలీసులను ఉపయోగించి బలవంతంగా సంతకం పెట్టించే ప్రయత్నంలో ఆమెపై చూపించిన కిరాతకం మానవత్వం మంటకలిపే విధంగా ఉందన్నారు. ఈ కేసు విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించి బాధ్యులైన పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా మృతుని కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా వచ్చే రాయితీలన్నీ ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని మరో సారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్థానిక పోలీసు యంత్రాంగం నిందితుడు అనంతబాబుని 48 గంటల్లో అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరచాలని, లేని యెడల దళిత సంఘాలతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గాలింకి నాగేశ్వరరావు, మోరంపూడి సూరిబాబు, దూలి ప్రవీణ్, పోలపల్లి చినరాజా పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement