విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం: విశ్వం వాయిస్:,
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరల నుంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని, ప్రధాని మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం వలన సామాన్య ప్రజలకు ఎంతో ఊరట కలిగిందని బీజేపీ యువమొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాళబత్తుల చిన్నారి అన్నారు. సోమవారం మండల కేంద్రం ఆత్రేయపురం లో తన స్వగృహం వద్ద మాట్లాడుతూ
పెట్రోల్-డీజిల్ ధరల తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని
నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం పరిస్థితుల్లో కష్టాలు
ఎదురైనప్పటికీ బిజేపి
సారధ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశ ఆర్థిక
వ్యవస్థను గాడిలో పెడుతోందని, ఇటు దేశం, అటు ప్రజలే బీజేపికి ముఖ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని
చిన్నారి అన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు
వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం కూడా పెట్రోల్ – డీజిల్ పై పన్నులు తగ్గించి ప్రజలపై భారం పడకుండా తమ నిబద్ధత నిరూపించు కోవాలన్నారు. లేనిపక్షంలో వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలను భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తుందని ఆమె తెలియచేసారు.