Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మెట్టకు జూన్ 14 న సాగు విడుదల””ఏడిఏ ప్రకాష్ ప్రకటన”””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, మే 23, (విశ్వం వాయిస్ న్యూస్) ;

ఆంధ్ర్రదేశ్ రాష్ట్రంలోని నీటి పరీవాహక ప్రాంతాల ఆయకట్టు సాగు భూములకు కొత్తగా ఈ ఏడాది జూన్ 1 నుంచే సాగు నీటిని ప్రభుత్వం అందించ నున్నది…

తద్వారా ఖరీఫ్ పంట సాగు (ఏరువాక) కాలాన్ని ముందుగా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్దంగా ఉంది… ఏడాదికి మూడు పంటలను పండించేందుకు రైతులను సమాయత్తం చేస్తోంది… ఈ నేధ్యంలో మెట్ట ప్రాంతంలోని సాగు నీటి జలాల ఆయకట్టు ప్రాంతంలోని వ్యవసాయ సాగు భూములకు జూన్ రెండో వారంలో నీటిని ప్రభుత్వం అందించ నున్నదని

పెద్దాపురం రైతు శిక్షణా కేంద్రం, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు

ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని రైతు భరోసా కేంద్రం -3 లో శంఖవరం మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏడిఏ ప్రసాద్ రైతు సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. రెండో వారంలో నీరివ్వ నున్నందున సకాలంలో సాగు రైతులు అందరూ వ్యవసాయ పనులను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. మనకి జూన్ నెల రెండవ వారంలో నీరు విడుదల చేస్తారనీ, అందువల్ల ఆ సమయానికల్లా మెట్ట ప్రాంత సాగు రైతులు అందరూ దమ్ము చేసుకుని సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. నీరు విడుదల అయ్యిన తర్వాత ఆకు నారు పోసుకుంటే వాతావరణానికి అనుగుణంగా ఉంటుందని, అలా సాగు చేయడం పాటు వలన అధిక దిగుబడులతో పాటు చీడ పీడల ఉధృతి తగ్గుతుందని ఆయన వివరించారు. అలాగే సరైన సమయానికి ఆకును

వేసినందున నవంబర్ నెలలో వచ్చు తుఫాన్ల నుంచి కూడా పంటను తప్పించు కోవచ్చని తెలియ జేసారు. భూములను ఖాళీగా ఉంచిన రైతులు వెంటనే పచ్చి రొట్ట పైర్లు పిల్లిపెసర, జీలుగు, జనుములు వేసి 50 % పూత దశలో భూమిలో కలియ దున్నితే ఆ నేలలో కర్బన శాతం పెరిగి నేల సారవంతం అవుతుందని, తద్వారా తదుపరి ఊడ్పు పొలంలో వేయాల్సిన యూరియాను కూడా తగ్గించి వేసుకునే అవకాం ఉంటుందని ఆయన విశదీకరించారు. అపరాలైన పెసర, మినుములను కూడా కోతానంతరం కలియ దున్ను కోవచ్చని తెలియ జేసారు. అలాగే రసాయన ఎరువుల వాడకం తగ్గించి పశువులు పెంట, పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని, లేని పక్షంలో నేలలు నిస్సారం అవుతాయని, కర్బన శాతం తగ్గి ఇక ఆ భూములు వ్యవసాయ యోగ్యం కావని ప్రకాష్ హెచ్చరించారు. ఈ ఖరీఫ్ కాలంలో కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మండల వ్యవసాయాధికారి కేజే చంద్రశేఖర్ తెలియజేసారు.

పంచాయితీ ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వీరబాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు విలియయ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement