Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో””కులాల మధ్య వైసిపి చిచ్చూ పెట్టవద్దు””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* ఎస్సీ లకు సంబంధించిన 27 పథకాలను ప్రభుత్వం
తూ.చా తప్పకుండా అమలు పరచాలి.. బిఎస్పి
డిమాండ్*
* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు నామకరణం*
* చేయటం చాలా మంచి పరిణామం..*
* అంబేద్కర్ జిల్లాకి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం
జగన్మోహన్రెడ్డి కుట్రలో భాగం..*
* కులాల మధ్య*
*చిచ్చూ పెట్టొద్దు*
* వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దారుణ హత్యలు,
అత్యాచారాలు పెరిగిపోయాయి..*

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

*అమలాపురం- విశ్వం వాయిస్ న్యూస్:*

*బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సమావేశము అమలాపురంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్. గౌతమ్ అశోక్ దుడ్డువారి అగ్రహారం వారి స్వగృహములో జరిగింది.*

 

*అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జుత్తుక సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల నరశింహ మాట్లాడుతూ*

*అమలాపురం జిల్లాని డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జిల్లాగా నామకరణం*

*చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తంపరిచారు. అయితే అంబేద్కర్ జిల్లాకి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం* *సరైనది కాదని* *ఇది కేవలం జగన్ మోహాన్ రెడ్డి కుట్రలో భాగమేనని,* *ఇది కులాల మధ్య*

*చిచ్చూ పెట్టడమేనని* *అన్నారు.*

 

*అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న శెట్టిబలిజ కులస్తులు డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.*

 

*సభాధ్యక్షులు జుత్తుగ సత్యనారాయణ ఉపన్యాసంలో మాట్లాడుతూ ఇరవై ఆరు జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన 12 జిల్లాలకు లేని ప్రజా అభిప్రాయ సేకరణ ఒక్క డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జిల్లాకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.*

 

*జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. గౌతమ్ మాట్లాడుతూ ఈ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మాత్రమే ఉంచాలని, దానితోపాటు రెండు సంవత్సరాలుగా ఎస్సీ లకు సంబంధించిన 27 పథకాలలో భాగంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆ నిధులను వేరే కార్యక్రమాలకు బదలాయించడం పై దుయ్యబట్టారు. ఈ పథకాలను పునరుద్ధరించే వరకు గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.*

 

*వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో దళితులపై దారుణ హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని, రానున్న ఎన్నికలలో భాగంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పేర్కొన్నారు.*

 

*ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు కాశీ లక్ష్మీభవాని, ఐ. పోలవరం మండల ఇంచార్జ్ కే. క్రాంతి కిరణ్, మట్టపర్తి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.*

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement