హాస్యాస్పదం
ఒక మహిళ పసుపు కుంకాలు తుడిచి.. పుట్టబోయే
బిడ్డకు తండ్రిని దూరం చేసి
– సామాన్యులకు ఒక చట్టం.. బడా బాబులకు మరొక
చట్టం ఉందా ?
– బడా నాయకులు వద్ద పనిచేస్తున్న సామాన్యులకు
ప్రాణహాని ఉంటుందా ?
– సుబ్రహ్మణ్యం మృతికి అక్రమ సంబంధాలే కారణమా ?
– అనంత బాబు ను కఠినంగా శిక్షించాలంటూ
న్యాయవ్యవస్థకు ప్రజలు విజ్ఞప్తి
– జిల్లా లో మర్డర్ కేసు ను ఆక్సిడెంట్ గా ఎఫ్ఐఆర్..
సిగ్గుచేటు
తప్పుడు కథనాలు అంటూ మీడియాపై మండిపాటు..
అణిచివేత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
( విశ్వం వాయిస్ న్యూస్ ) ఎడిటర్ః
రోజురోజుకు మనిషిలోని మానవత్వం తగ్గిపోతూ వస్తోంది. అక్రమ సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని చెప్పుకోవాలి. మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. అయితే కొంతమంది అధికార అహంతో… మరికొంతమంది ధనమదంతో పెట్రేగి పోతున్నారు. అందుకు ఉదాహరణగా కాకినాడలో జరిగిన వీధి సుబ్రహ్మణ్యం హత్యేనని చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్ గా పని చేస్తూ మానివేయడం.. తర్వాత డ్రైవర్ను ఫోన్లో బాబు బెదిరించడం పుట్టినరోజు వేడుకలు అంటూ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్లి ప్రాణం లేని శరీరాన్ని తీసుకొచ్చి అప్పగించడం తెలిసిన విషయమే.. సుబ్రహ్మణ్యం మృతుని పోలీసులు యాక్సిడెంట్ కేస్ అంటూ అనుమానస్పద రీతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో జిల్లా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి దళిత సంఘాలు, ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డు ఎక్కడంతో జిల్లా పోలీసులకు సుబ్రమణ్యం మృతి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఈ విషయంలో మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్తిబాబు నూకరత్నం, భార్య అయిన అపర్ణ లు అధికారం.. ధన ప్రలోభాలకు లొంగిపోకుండా న్యాయం కోసం పోరాటం సాగించడంతో పోలీసులు, అధికార పార్టీ నాయకులకు తమ కర్తవ్యాలను గుర్తు చేశాయి. ఇంకా చేసేదేమిలేక పోలీసులు చివరకు పోస్టుమార్టం రిపోర్టు ఆధారం చేసుకుని అజ్ఞాతంలో ఉన్న అనంత బాబును రాచమర్యాదలతో తీసుకువచ్చి లొంగిపోయినట్లుగా మీడియాకు సినిమా చూపించారు. అయితే ఒక మహిళ కూతురి పసుపు కుంకాలు తుడిచివేసి.. తన గర్భంలో ఉన్న శిశువుకు తండ్రిని దూరం చేసిన నాయకుల ప్రజలను పాలించేది అంటూ ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య గోదావరి జిల్లాల్లో సంచలనం రేపింది అయినప్పటికీ ముఖ్యమంత్రి, స్థానిక అధికార పార్టీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, దళితులకు పెద్దపీట అంటూ దళితుల ప్రాణాలను హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోం…. వచ్చే ఎలక్షన్లో దళితుల సత్తా చాటుతాం ముఖ్యమంత్రి ఖబర్దార్ అని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అనంత బాబు దుర్మార్గాలకు ఇంకా ఎంత మంది బలికావాలి.. ఎంతమందిని బలి తీసుకుంటారో వేచి చూడాల్సిందే అంటున్నారు ? ఉదయ భాస్కర్ ను కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు న్యాయవ్యవస్థను కోరుకుంటున్నారు.