Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గ్రామ వార్డు వాలంటరీ లకు సేవా పురస్కారం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కరప విశ్వం వాయిస్ న్యూస్:

ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ గ్రామ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండలంలో నడకుదురు గ్రామంలో కుసుమ సత్య ఫంక్షన్ హాల్ నందు మంగళవారం ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన గ్రామ వాలంటరీ లకు సేవల సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత విశ్వనాథ్, పాల్గొని మాట్లాడుతూ మే 23 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నేటి వరకు మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి గా తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం గ్రామ సచివాలయ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్లకు 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటరీ నియమించి వ్యాప్తంగా సుమారు రెండు లక్షల 30 వేల మందిని గ్రామ వాలంటరీ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వాలంటరీ వ్యవస్థ ను చూసి పక్క రాష్ట్రాలైన తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి నేరుగా వెళ్లే అందజేసిన వాలింటర్ సేవలకు మండలంలో ఏడుగురు మహిళలకు ఎంపికవ్వడం వారి సేవలు మరువలేనివని తెలిపారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా వజ్ర, అవార్డులతో వాలంటరీ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కర్రీ స్వప్న, తాసిల్దార్ పి శ్రీనివాసరావు, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వాలంటరీ లు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వైసిపి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement