మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు రగులుతున్న కోనసీమ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్)
పచ్చని కోనసీమ లో వున్నట్టుండి ఒక్కసారి భగ్గుమంది… మంగళవారం ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఏపీలో కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడంపై వారం రోజులుగా అమలాపురం పరిసర ప్రాంతాలలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్ కు ఈ అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకు అధిక సంఖ్యలో ర్యాలీగా వెళుతున్న నిరసనకారులపై పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో 144 సెక్షన్ అదుపులో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదు అని పోలీసులు చెప్పినప్పటికీ ఆందోళనకారులు వినలేదు. పోలీసులు లాఠీఛార్జి చేసినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. 500 మంది పోలీసులు మోహరించిన నిరసన కారులను పోలీసులు అదుపు చేయలేక పోయారు.పోలీసులు ఆదివారం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు భారీ ఎత్తున పోలీసు పికెటింగ్ నిర్వహించినప్పటికీ అది నీరుగారిపోయింది. ఆందోళనకారులు ఒక్కసారి రోడ్ల మీదికి వచ్చేసరికి పోలీసులు వాళ్లని ఏమీ చేయలేకపోయారు . పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ ముట్టడికి భారీగా ఆందోళనకారులు ముట్టడి చేశారు.
ఆందోళనకారులను చెదరగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఆందోళనకారులు పోలీసులపై తిరగపడిన పోలీసులపై రాళ్లు దాడి చేశారు.
జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడిచేసిన ఆందోళనకారులు చేయడం జరిగింది. రాళ్లు దాడిలో ఎస్పీ గాన్ మాన్ తలకిగాయాలయ్యాయి.ఆందోళనకారులను చెదరగోతు సొమ్మసిల్లి అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్ కాలేజ్ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.అమలాపురంలో పూర్తిగా అదుపు తప్పింది మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన నిరసనకారులు , హౌసింగ్ బోర్డు కాలనీలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు.మంత్రి విశ్వరూప్ ఇంటి సమీపంలో మూడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు.