Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రత్యేక శ్రద్ధతో లేఅవుట్లు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– పేదలందరికీ ఇల్లు ఈ పథకంలో భాగంగా..
– నగర్ లేవు పనులు వారం రోజుల్లో పూర్తి కావాలి
– జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

అర్డన్ హౌసింగ్ లేఅవుటు పనులకు సంబంధించి మిగిలిన పనులను వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా అర్బన్ కి సంబంధించి లేఅవుటు లెవలింగ్, స్టోన్ ప్లాంటేషన్, జియో ట్యాగింగ్, పట్టాల పంపిణీ, లబ్ధిదారుల మ్యాపింగ్ తదితర అంశాలకు సంబంధించి కలెక్టర్ కృతికా శుక్లా..జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్, ఇరిగేషన్, ట్రాన్స్ కో, ఆర్డబ్ల్యూఎస్ తదితరశాఖలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి లేఅవుటులలో పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమన్వయ శాఖల అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసులక్ష్యానికి అనుగుణంగా పనులలో పురోగతి చూపాలని కలెక్టర్ తెలిపారు. అర్బన్ లబ్ధిదారులకు కేటాయించిన కొమరగిరి లేఅవుటుతో పాటు పండూరు లేఅవుటు-2 లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ

సమావేశంలో హౌసింగ్ పీడీ సుధాకర్ పట్నాయక్, నగర కమిషనర్ కె.రమేష్, ఏడీసీ సీహెచ్. నాగనరసింహారావు, స్థానిక ఆర్డీవో బీవి రమణ, ట్రన్స్ కో, డ్రైయిన్స్ ఈఈలు ఉదయభాస్కర్, కె.సబ్బయ్య, యు. కొత్తపల్లి, అర్బన్, గ్రామీణ తహసీల్దార్ లు ఎల్.శివబాబు, వైహెచ్ఎస్.సతీష్, వి. మురార్జీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement