– అదుపులో 70 మంది ఆందోళనకారులు… మంత్రి వేణు వెల్లడి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
కోనసీమకు చెందిన ఆ ప్రాంత వాసులు సయమనం పాటించి ప్రశాంతత వాతావరణంకు సహకరించాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కోరారు. కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్నిపై జనసేన అధినేత పవన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ల ఇళ్లు దగ్ధంనకు కారణమైన సుమారు 70 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మంత్రి వేణు తెలిపారు.
బుధవారం రాత్రి స్థానిక అర్అండ్బి అతిథి గృహంలో మంత్రి వేణు గోపాల కృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంనకు మారుపేరుగా ఉండే కోనసీమ జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి పేరుతో విధ్వంస కారులు ఆందోళన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలీసులు సయమనం పాటించి కాల్పులను ఆందోళనకారులపై జరప. యువత ఎటువంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హితవు పలికారు. అంబేద్కర్ పేరును ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటూనే పవన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎక్కడా అంబేద్కర్ పేరును కొనసాగించాలని స్పష్టంగా చెప్పలేదని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన కథనే పవన్ తన ప్రసంగంలో పలికారన్నారు. ప్రతిపక్ష పార్టీలు వైకాపాపై కావాలనే బురద జల్లుతున్నాయన్నారు.
అభ్యంతరాలను 30 రోజుల లోగా తెలిపే అవకాశం ఉన్నా జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రతిపక్ష నాయకుల కుట్ర అని వేణు అభివర్ణించారు. వైసిపి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తోందని చెప్పారు. ఇది వైకాపా ప్రభుత్వంపై ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర అంటూ మంత్రి వేణు పేర్కొన్నారు.