విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమజిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండల పరిధిలోని పొడగట్లపల్లి గ్రామ శివారు రామచంద్రపురం గ్రామాభివ్వద్దికి కృషి చేసిన అల్లూరి శ్రీరంగరాజు విగ్రహాన్ని కొత్తపేట రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు నియోజకవర్గ బాద్యులు బండారు సత్యానందరావు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ రంగరాజు సేవలు మరువలేనివని పొడగట్లపల్లి గ్రామాభివృద్ధికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వాటికి నా సహకారం కూడా వారు ఎప్పుడు అడిగినా అందించానని వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రంగరాజు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారుచేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలకాలం చిరంజీవిగా పొడగట్లపల్లి చరిత్రలో, ఆగ్రామ ప్రజల మనస్సుల్లో ఉంటారని కొనియాడారు.
గ్రామానికి ఈఅభివృద్ది కార్యక్రమం కావాలని రంగరాజు తపనతో కోరికతో శ్రీరాముడిలా ఆదేశిస్తే హనుమంతునిలా అల్లూరి సత్తిరాజు నాదగ్గరకు వచ్చి ఆకార్యక్రమం పూర్తయ్యే వరకూ పట్టువదలని విక్రమార్కుడిలా సాధించే వరకూ వదిలేవారు కాదని బండారు ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
ఆనాడు నేను చిన్నవయసులో శాసనసభ్యునిగా ఎన్నికైనపుడు రంగరాజు తమయొక్క అపారమైన అనుభవంతో నాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారని బండారు జ్ఞాపికి తెచ్చుకొన్నారు.వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, రంగరాజు కి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధానకార్యదర్శి ఆకుల రామకృష్ణ మరియు శ్రీ రంగ రాజు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.