విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ : అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదానికి గురైన రోగి ప్రాణాలు కాపాడడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ అపోలో ఆసుపత్రి ప్రధాన పరిపాలకుడు ఐ. వి.రమణ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా అత్యవసర వైద్య సేవలు, విధానాలపై శుక్రవారం సాయంత్రం అపోలో హాస్పిటల్స్ వద్ద మాక్ డ్రిల్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు లోనయిన వారికి , యాక్సిడెంట్ అయిన వారికి , బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయి పడిపోయిన వారికి , గుండె నొప్పితో సృహ తప్పి పడిపోయిన వారికి,ఆకస్మికంగా షాక్ కు గురి అయిన వారికి ఏ విధంగా కాపాడాలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ప్రమాదంలో ఉన్న వ్యక్తి పట్ల సాటిమనిషిగా ప్రతిఒక్కరు స్పందించాలని, అలాగే వైద్య శాలలు కూడా రోగికి తక్షణ వైద్య సేవలు అందించి కాపాడిన తర్వాత మాత్రమే ఇతర ఆర్ధిక, వైద్య చికిత్స అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.ఈసందర్భంగా హాస్పిటల్ నర్సులు,వైద్యులు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.పి. ఛటర్జీ,డా.మనోహర్,డా.కె.ఎస్.ఆర్.గాంధీ, డా.కరుణాకర్,పిఆర్వో మూర్తి,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.