Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గ్రామ సమస్యలు పరిష్కారానికి””మండల సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )

మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామం లో గల ఎంపీపీ కార్యాలయంలో స్థానిక మండల అధ్యక్షురాలు వైఎస్ మే డిశెట్టి సత్యవేని దుర్గారావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యి, శాఖల వారీగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశం లో తోట త్రిమూర్తులు అధికారులు హాజరు తీసుకున్నారు. ఎక్సయిజ్, ఐ కే పీ అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తమ గ్రామాల్లో వున్న సమస్యలు ఈ ఎంపీపీ సమావేశ0లో అధికార్లు దృష్టికి తీసుకుని వచ్చి, పరిష్కరించు కోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సూచించారు. గ్రామ వాలెంటీర్లు, సచివాల యాలు ద్వారా ప్రజల ముంగిటకు పరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని తోట త్రిమూర్తులు అన్నారు. వల్లూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు జగనన్న భీమా ఒక లక్ష మాత్రమే యిచ్చారని ఆ గ్రామ సర్పంచ్ దాసి మీనా కుమారి సభ దృష్టికి తీసుకొచ్చారు. కౌలు రైతు రుణ బారం తో ఆత్మ హత్య చేసుకుంటే ముందుగా మండల త్రీ మెన్ కమిటీ వారు మూడు రోజుల్లో నిర్దారణ చేసి రెవెన్యూ డివిజనల్ కమిటీ కి పంపాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. పశు పెంపకం దారులు కదలలేని పశువుల వైద్య0 కొరకు సంచార పశు వైద్య వాహనం టోల్ ఫ్రీ నంబర్ 1962 కి సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు.వైస్ ఎంపీపీ గుణ్ణం భాను ప్రసాద్, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు, ఎంపీటీసీలు గొల్లపల్లి సోనియా, శీలం భాస్కర రావు, యర్రంశెట్టి నాగేశ్వర రావు, మే డిసెట్టి దుర్గారావు, ఉమ్మి డిసెట్టి వీరవేని సూరిబాబు, విప్ పలివెల మధు, సుంకర వేంకటేశ్వర రావు,సర్పంచ్ లు నాతి గవరయ్య, వీధి వెంకట రెడ్డి బాబు, దాసి మీనా కుమారి, దాయం కావేరి, శాఖా శ్రీనివాస్, వాసా కోటేశ్వర రావు, కుక్కల వీరన్న, వాశంసెట్టి సునీత, ప్రత్యేక అధికారి బులి రాణి,తహసిల్దార్ చిన్నా రావు, సిడిపిఓ గజ లక్ష్మి, ఏ పీ ఓ కవిత,ఏ ఓ ప్రకాష్ రావు, తదితర అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement