విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, నంద్యాల:
విశ్వం వాయిస్ న్యూస్
నంద్యాల:-ఉమ్మడి కర్నూల్ జిల్లాలో సామాజిక న్యాయబేరి బస్సుయాత్ర సందర్భంగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి అవుకు పోలీస్ స్టేషన్ కి తరిలించారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు సీమకృష్ణ మాట్లాడుతూ రాయలసీమ హక్కులడిగితే ముందస్తు అరెస్ట్ లు చేసి పోలీస్ స్టేషన్ కి తరిలించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.వైసిపి ప్రభుత్వనికి రాయలసీమలో 52 స్థానాలకు 49 ఎమ్మెల్యే స్థానాలిచ్చిన రాయలసీమకు చేసింది శూన్యమని మండిపడ్డారు.రాయలసీమకు నీళ్లు నిధులు నియామకాలలో న్యాయం చేయాలన్నాకు.అదే విధంగా ఈ నెల 31 న జరిగే సిద్దేశ్వరం అలుగు రాయలసీమ వెలుగు జలదీక్షను విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ విఎస్ నాయకులు హరినాయుడు,గోపాల్,సురెందర్ రెడ్జి పాల్గోన్నారు.