విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
కాలేరు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 158 మందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు దాటిన నేటి వరకూ ఎటువంటి మౌళిక వసతులు కల్పించలేదని ఆ స్థల లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఅవుట్ లో రక్షిత మంచినీటి సౌకర్యం, రహదారి, డ్రెయినేజీ, విద్యుత్ , రుణసౌకర్యం లు కల్పించకుండా ఇండ్లు నిర్మించ లేనందుకు ఆ పట్టాలు ఎందుకు రద్దు చెయ్యకూడదో తెలపాలని స్థానిక తహసీల్దార్ చిన్నారావు నోటీసులు ఇచ్చారని వారు వాపోయారు. మరల తహసీల్దార్ వారు తమకు ఎటువంటి నోటీసు లు ఇవ్వకుండా పలువురు గ్రామ రెవెన్యూ అధికారులు ని కాలేరు గ్రామం పంపి అనర్హులు గా చిత్రీకరించే భాగంగ సర్వే లు చేయిస్తున్నారని గ్రామ సర్పంచ్ దాయ0 కావేరి,లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2019 జనవరి 28 వ తేదీన అప్పటి అదికార టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పల్లంగా వున్న ఇండ్ల స్థలాన్ని మెరక చేసి,158 మంది లబ్ధిదారలకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. సర్వేలు పేరిట తాత్సారం చేయకుండా జగనన్న కాలనీ లో చేపట్టిన విధంగా కాలేరు గ్రామంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలు కు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, గృహ నిర్మాణాలు కు రుణ సదుపాయం కల్పించాలని సర్పంచ్ దాయ0 కావేరి, స్థల లబ్దిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.