Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రావులపాలెంలో ఇంటర్నెట్ కష్టాలు ఇబ్బంది పడుతున్న ప్రజానీకం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్)

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, రావులపాలెం మండలం లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ మొబైలు కంపెనీలు, బ్రాండ్ సంస్థలు కోనసీమ జిల్లావ్యా ప్తంగా, ఇంటర్నెట్ సేవల ను24-05-2022 మంగళ వారం సాయంత్రం నుండి నిలుపుదల చేసాయి. కోనసీమ జిల్లా పేరును తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ, నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం పాఠకులకు తెలిసి నదే.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో, కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు తలపెట్టిన ర్యాలీ సందర్భంగా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అమలాపురం తో పాటు25-05-2022వ తేదీ బుధవారం రోజున కోనసీమ సాధన సమితి ఆధ్వర్యం లోరావులపాలెంలో ర్యాలీకి పిలుపునివ్వడంతో, వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు బందోబస్తుతో కట్టడి చేయడంతో, ఎలాంటి నిరసన కార్యక్రమం జరగలేదు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30, 144 సెక్షన్లను పోలీసులు ఇప్పటి కేఅమలు చేయడంతో పాటు, తాజాగా ఇంటర్నెట్ సేవలను కూడా నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో, ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలుపుదల చేసిన విషయం పాఠకులకు విదితమే. ప్రస్తుతం రావులపాలెం, కొత్తపే ట, ఆత్రేయపురం మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు. ముఖ్యంగా ఇంట ర్నెట్ పై ఆధారపడి వర్కు ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డిటిపి సెంటర్ లు, ఈ సేవ సెంటర్లు, అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలు, ఇంటర్నెట్ ఆధారిత సంస్థల్లో సేవల స్తంభించాయి. నిన్న గురువారం సాయంత్రం నుండి కొన్ని ప్రాంతాల్లో మొబై ల్ ఇంటర్నెట్ పని చేయడం కొసమెరుపు. మండల కేంద్రం రావులపాలెంలో మాత్రం ఈ రోజు సోమవారం వరకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రాలేదు. మీడి యా ప్రతినిధులు వార్తల సమా చారాన్ని తమ సంస్థకు చేర వే సేందుకు అష్టకష్టాలు పడుతు న్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement