విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
మండలంలోని మాచవరం గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయం లో సోమవారం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. మండ ఆది రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కొవ్వూరి లక్ష్మీనారాయణ రెడ్డి అధ్యక్షతన అమ్మవారికి నైవేద్యం నిర్వహించారు. వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, వారి మ్రొక్కులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాత్రికి ఘనంగా జాతర నిర్వహించారు. మంగళవారం తీర్థం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.