విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: మే30: విశ్వం వాయిస్ న్యూస్:
ప్రజల అభివృద్ధికి కోసంఅవినీతి లేని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని మునిసిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్ పేర్కొన్నారు.వై యస్ ఆర్ సి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తుని పట్టణంలో వైసీపి శ్రేణులు వేడుక నిర్వహించారు.
సోమవారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తునిపట్టణం రామాధియేటర్ వద్ద వున్న రాజశేఖర్ విగ్రహానికి వైసీపి నాయకులు పూల మాలలు వేసి నివాళలర్పించారు.అనంతరం వైసీపి నాయకులు అనిశెట్టి సూర్య చక్రరెడ్డి కేకు ను కట్ చేసారు.కేక్ ను వైసీపి నాయుకులు పంపిణీ చేసి అనందోత్సహంతో గడిపారు.ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంటు పామర్తి మహేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలను ప్రవేశ పెట్టారన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు, ఎమ్.పి.సి. దొర బాబు,వైసీపి నాయుకులు సూర్య చక్ర రెడ్డి,బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.