విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:
భద్రాచలం , విశ్వం వాయిస్ న్యూస్ : భద్రాచలం
పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు కోట కాంతాభాయి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంతాభాయి మృతికి భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్ట్ ప్రాంగణంలో మెజిస్ట్రేట్ సురేష్ మరియు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సంధర్భంగా మేజిస్ట్రేట్ సురేష్ మాట్లాడుతూ కోట కాంతాభాయి ఏజెన్సీలో మూడు దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆమె దగ్గర విద్యను అభ్యసించినవారు ఎందరో ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఆమె కుమారుడు రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట దేవదానం ఎంతోమంది కక్షిదారులకు ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందించారని తెలిపారు. కాంతాభాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం న్యాయవాదులు , కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.