Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిజిహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

హైకోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించాలి….
హెచ్.డి.ఎస్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని
న్యాయం చేయాలి…
సిఐటియు విజ్ఞప్తి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్

కాకినాడ, మే31; కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించాలని సిఐటియు కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణలు ఒక ప్రకటన విడుదల చేశారు.కాకినాడ జీజీహెచ్ లో గత 20 ఏళ్ళ క్రితం హెచ్.డి.ఎస్.తీర్మానంతో కొంతమందిని,ఆరోగ్య శ్రీ నిధులతో జీతాలు చెల్లించడానికి మరికొంత మందిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించిన సంగతి తెలిసిందే అన్నారు. వీరందరినీ 2011 జూన్ లో నాటి జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో కలెక్టరేటులో ఏర్పాటు చేసిన వికాస సంస్థ పరిధిలోకి తీసుకు వచ్చారని పేర్కొన్నారు.నాటి నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనిష్టంగా రూ. 4030. గరిష్టంగా రూ.6110 మాత్రమే జీతం పొందుతూ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఏళ్ళ తరబడి చాలీ చాలని జీతాలతో, ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒక్కసారిగా విధుల నుండి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. డి.ఎం.ఇ.వారి మౌఖిక ఆదేశాలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు రాకుండా నిలుపుదల చేయాలని వికాస పిడి వారికి జీజీహెచ్ అధికారులు లేఖ పంపడం చాలా దారుణమని విమర్శించారు.ఇప్పటికే నక్షత్ర ఏజెన్సీ పేరుతో సేవలు అందించిన 65 మంది ఉద్యోగులను కూడా అన్యాయంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సుమారు 100 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉద్యోగులను విధుల నుండి తొలగించరాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రిట్ నెం. 22801/2021 ప్రకారం 2021 నవంబర్ 23 న ఒక ఉత్తర్వు, రిట్ నెం.30267/2021 ప్రకారం 2021 డిసెంబర్ 23న మరొక ఉత్తర్వు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని హైకోర్టు స్పష్టంగా తెలిపిందన్నారు.దయచేసి అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడరాదని సిఐటియు విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి మండలి ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ వారు స్వయంగా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వీరబాబు, రమణ ఒక ప్రకటనలో కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement