Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమలాపురం విధ్వంసంలో పాత్రధారులనే కాదు””సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అన్ని రాజకీయ పార్టీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గా కొనసాగించే విధంగా తమ వైఖరి ప్రకటించాలి
వామపక్ష, విప్లవ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా
సంఘాల నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్

అమలాపురం విధ్వంసంపై వామపక్ష , విప్లవ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల సమావేశం కాకినాడ కచ్చేరి పేటలో గల సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ దళిత నేత అయితా బత్తుల రామేశ్వరరావు, సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, సిపిఐ జిల్లా నాయకులు తోకల ప్రసాద్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే వెంకటేశ్వర్లు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు అయినారపు సూర్యనారాయణ,ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు కాశి బాలయ్య,అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు పి బసవయ్య, గరగ దుర్గారావు,ఆలిండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డి.కాళీ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్న డా. బి.ఆర్ అంబేద్కర్ పేరును అమలాపురంలోని కుల దురహంకారులు వ్యతిరేకించడం గర్హనీయం అన్నారు. భారత రత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక కులానికి పరిమితం చేయడం శోచనీయం అన్నారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, మహిళా బిల్లు కోసం, కార్మిక హక్కుల కోసం,రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకోసం, దేశ సమైక్యత, సమగ్రత కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడని కీర్తించారు.

 

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును కొనసాగించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమలాపురం విధ్వంసంలో పాత్రధారులనే కాదు, సూత్రధారులను కూడా తక్షణం అరెస్టు చేయాలని,అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి అభ్యంతరాలతో సంబంధం లేకుండా డా. బి.ఆర్.అంబేద్కర్ జిల్లా పేరును కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement