Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 4:14 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 4:14 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 4:14 PM
Follow Us

గృహ నిర్మాణ పనులు””వేగవంతం చెయ్యాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్

*గండేపల్లి/జగ్గంపేట/ప్రత్తిపాడు, మే31, 2022.*

గృహ నిర్మాణాలకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం సంబంధించి మంగళవారం పెద్దాపురం డివిజన్ గండేపల్లి మండలం లోని మల్లేపల్లి, గండేపల్లి, మురారి గ్రామాల్లోని హౌసింగ్ లేఅవుటులను, జగనన్న కాలనిలలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా..హౌసింగ్, రెవెన్యూ, సర్వే ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ జగ్గంపేట, ప్రత్తిపాడు గ్రామాల్లోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం నిమిత్తం సిద్దం చేసిన లేఅవుటులను, జగనన్న కాలనీలలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక, సిమెంటు, స్టీల్ ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలన్నారు. హౌసింగ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించి రానున్న 15 రోజులలో లేఅవుటు పనులతోపాటు గృహ నిర్మాణ పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో పురోగతి చూపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మురారి గ్రామం జగనన్న కాలనీలో నిర్మాణం పూర్తైన గృహ సముదాయాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట గండేపల్లి మండల రెవెన్యూ అధికారి జీ.చిన్నారావు, ఎంపీడీవో కెఎ. జాన్ లింకన్, ఎంపీపీ సీహెచ్ దొరబాబు, జగ్గంపేట తహసీల్దార్ వై.సరస్వతి, ఎంపీడీవో ఎం.సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాడు తహసీల్దార్ పీ.గోపాలకృష్ణ, హౌసింగ్, ట్రాన్స్ కో, ఎన్ఆర్జీఎస్ ఏపీవోలు, సచివాలయం సిబ్బంది ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement