Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పొగాకు కు దూరంగా””” ఆరోగ్యంగా జీవించండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం విశ్వం వాయిస్ న్యూస్:

పొగాకు దూరంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండని రాయవరం పీహెచ్సీ వైద్యాధికారి అంగర దేవి రాజశ్రీ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం పిహెచ్సి వద్ద మంగళవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంగర దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పొగాకును నీవు కాలిస్తే అది నీతో పాటు నీ కుటుంబాన్ని కాల్చేస్తుంది. పొగాకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలనుద్దేశించి డాక్టర్ దేవి రాజశ్రీ మాట్లాడుతూ ధూమపానం చేయడం లేదా పొగాకు ఉత్పత్తులను నోటి ద్వారా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ రావడం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పొగాకు సేవించిన వారు వదిలిన పొగ పీల్చడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారని ఇతరులు కూడా అంతే ఇబ్బంది పడే అవకాశం ఉందని వీరిని సెకండరీ స్మోకర్స్అని కూడా అంటారని, పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8 మిలియన్ల మంది చనిపోతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేస్ లలో పొగాకును వినియోగించడం నిషేధించడమైనది దీని స్కూల్ ఆవరణ కు సుమారు వంద మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధించడమైనది ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు పర్యావరణాన్ని కాపాడండి అనే శ్లోకం ఇవ్వడం జరిగిందని, ఈ రోజు పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేటట్లు చేయడమే ప్రపంచ ముఖ్య ఉద్దేశం ఆమె అన్నారు. ఎవరికైనా పొగాకు సేవించే అలవాటు ఉండి వాటినుండి మానేయాలని అనుకునేవారు వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ఈ బృహత కార్యక్రమంలో ప్రజల సహకారం పూర్తిగా కావాలని వారు సహాయ సహకారాలు అందించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సిహెచ్ రమ్యశ్రీ, హెల్త్ ఎడ్యుకేటర్ డి కృష్ణ శేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వాణి కుమారి, హెల్త్ సూపర్వైజర్ జే.శంకర్, ఎన్ విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు కే వెంకటేశ్వరరావు, పి. భాస్కర్, జి రామలక్ష్మి, ఏఎన్ఎం ఏం బుజ్జి మరియు ఆయా గ్రామాల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement