సిద్ధంగా ఉండాలి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్:
రానున్న వర్షకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన కార్యాచరణ తో సిద్దంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు.
శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మలేరియా, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల వ్యాప్తి నివారణను అరికట్టాలన్నారు. వాంబే కాలనీ, జన సమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపేయన్ నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాల్సి ఉందన్నారు. పంచాయతీ రాజ్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ తో సమన్వయం చేసుకోవాలన్నారు. డ్రైనేజిల్లో నిలిచిన వర్షపు నీటిని ప్రవహించేలా చూడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో నీటినిలువలు ఉన్న ప్రాంతాల్లో, గార్డెన్ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు పురుగుల మందులను పిచికారీ చేస్తూ ఉండాలన్నారు. ప్రజలు వ్యక్తిగతభాద్యతగా ఇంటి పరిసరాల్లో చెత్త, నీరు పేరుకుపోకుండా జాగ్గత్తలు తీసుకోవాలని, వాడేసిన కొబ్బరిబొండాలు, ట్యూబ్స్ లలో నీటి నిల్వలేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పనసరిగా నీటి ట్యాంకులపై దోమలు చేరకుండా సరిగ్గా మూత పెట్టాలన్నారు. మలేరియా ప్రాణాంతకమైన వ్యాధను, దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధి కారణంగా ప్రతి ఏటా చాలామంది మరణిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు ఇప్పటి వరకు నమోదు కాకపోయినా, రానున్నది వర్షాకాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మలేరియా ఎక్కువగా వర్షాకాలంలో కనిపించే ఆరోగ్య సమస్య, ముఖ్యంగా పారిశుధ్యలోపాలను అధిగమించి మలేరియా వ్యాప్తి చెందకుండా దోమలను నివారించే విధంగా సంబందిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే నెలాఖరకు రాజమహేంద్రవరం డివిజన్లో 29, కొవ్వూరు డివిజన్ లో 6 డెంగ్యూ వైరస్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. చికెన్ గునియా, మలేరియా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో
ఇంచార్జి డిఎం హెచ్ వో డా.ఎన్. వసుందర, డిప్యూటీ డిఎం హెచ్ వో లు రాజమండ్రి, కొవ్వూరు డా. కె. సుధాకర్, జి. వరలక్ష్మి, డిపివో జె. సత్యనారాయణ, డిఈవో ఎస్. అబ్రహం, డి ఆర్ డిఏ పిడి డేగలయ్య, మెప్మా పిడి రవికుమార్, డిసిహెచ్ ఎస్ సనత్ కుమారి తదితరులు పాల్గొన్నారు.